హైదరాబాదు : నగరంలో తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు..!

హైదరాబాదు : నగరంలో తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు..!

హైదరాబాద్ , మనసాక్షి :

తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపై తిప్పేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇటీవల హైదరాబాద్ నుండి విజయవాడకు ఎలక్ట్రిక్ గరుడ బస్సులను ప్రారంభించారు . రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,ఆర్టీసీ ఎండి వి సి సజ్జనార్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ గరుడ ఏసి బస్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ – విజయవాడ కు 10 ఎలక్ట్రిక్ గరుడ బస్సులను ప్రారంభించారు. కాగా త్వరలో హైదరాబాద్ – విజయవాడ రూట్ లో 50 ఈ – గరుడ బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 20 నిమిషాలకు ఒక గరుడ బస్సు నడిపే విధంగా ఏర్పాట్లు చేశారు. ఏడాదిలోగా 50 బస్సులను నడపనున్నారు.

 

అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా రెండు సంవత్సరాల కాలంలో 1860 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు తెలంగాణ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. వాటిలో మొట్టమొదటిగా హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నారు.

 

త్వరలో నగరంలో 10 డబుల్ డెక్కర్, 550 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లు వీసి సజ్జనార్ ఎలక్ట్రిక్ గరుడ బస్సుల ప్రారంభోత్సవం సందర్భంగా పేర్కొన్నారు. దాంతో త్వరలో నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు తిరగనున్నాయి.