Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsసినిమా

భారతదేశపు ఫిలిం మేకర్‌లకు సాధికారత.. అకాడెమీని ఆవిష్కరించిన స్క్రీన్..!

భారతదేశపు ఫిలిం మేకర్‌లకు సాధికారత.. అకాడెమీని ఆవిష్కరించిన స్క్రీన్..!

ముంబై , మన సాక్షి : 

భారతీయ సినిమా రంగంలో వర్ధమాన గొంతుకలకు ప్రోత్సాహం కల్పించే దిశగా లాభాపేక్షరహితమైన స్క్రీన్ అకాడెమీని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ మరియు స్క్రీన్ ఆవిష్కరించాయి. ఈ అకాడెమీకి లోధా ఫౌండేషన్‌ యొక్క ఫౌండింగ్ ప్యాట్రన్ అభిషేక్ లోధా దీనికి ఉదారంగా తోడ్పాటు అందించారు. FTII (పుణె), SRFTI (కోల్‌కతా), విజ్లింగ్ ఉడ్స్ (ముంబై)లాంటి ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన ప్రతిభావంతులైన ఫిలిం విద్యార్థులకు, ముఖ్యంగా ఆర్థికంగా సవాళ్లు ఎదుర్కొంటున్న వారికి, ఈ అకాడెమీ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఫెలోషిప్‌లను అందిస్తుంది.

పరిశ్రమలో సీనియర్లు, ప్రతిష్టాత్మకమైన కాన్ మరియు ఆస్కార్ వంటి పురస్కారాల గ్రహీతలైన గునీత్ మోంగా, పాయల్ కపాడియా, రసూల్ పోకుట్టి తదితరులు విద్యార్థులకు మాస్టర్‌క్లాస్‌లు, ఇంటర్న్‌షిప్‌లు, ప్రొఫెషనల్ గైడెన్స్ ద్వారా తోడ్పాటు అందిస్తారు.

అకాడెమీ ప్రత్యేకతలు:
• టాప్ ఫిలిం విద్యార్థులకు వార్షికంగా ఫుల్లీ-ఫండెడ్ ఫెలోషిప్‌లు
• భారతదేశపు దిగ్గజ ఫిలిం స్కూల్స్‌తో భాగస్వామ్యం
• ప్రముఖ ఫిలిం ప్రొఫెషనల్స్‌తో మెంటార్‌షిప్
• స్క్రీన్ అవార్డ్స్‌ను కూడా పర్యవేక్షించడం, పటిష్టపర్చడం
• అవార్డుల మదింపు ప్రక్రియ సముచితంగా, విశ్వసనీయంగా ఉండేలా రెసిడెంట్ క్రిటిక్స్ ప్యానెల్ ఏర్పాటు
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరియు ఫిలిం ఇనిస్టిట్యూట్లకు చెందిన పలువురు ప్రముఖులు, అకాడెమీ ఏర్పాటును స్వాగతించారు.

“ముంబైతో సినీ పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఏర్పాటు చేసిన స్క్రీన్ అకాడెమీతో భారతీయ సినీ పరిశ్రమకు గణనీయంగా ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నాను” అని ఫడ్నవీస్ తెలిపారు. “వినోదం, సాంస్కృతిక రంగాల్లో శ్రేష్ఠతను సాధించే దిశగా స్క్రీన్ అకాడెమీ ఒక కీలక ముందడుగు. ప్రతిభావంతులకు ఆర్థికంగానే కాకుండా అన్ని రకాలుగా తోడ్పాటు అందించగలిగే వ్యవస్థను మేము తీర్చిదిద్దుతున్నాం” అని ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ గోయెంకా పేర్కొన్నారు.

MOST READ : 

  1. CM Revanth Reddy : దేవుడినైనా ఎదిరిస్తా.. తెలంగాణ ప్రజల తరపున నిలబడతా..!

  2. Croma : క్రోమా బ్యాక్ టు క్యాంపస్ సేల్.. ల్యాప్‌టాప్‌లు రూ.28,990..!

  3. IT : క్లియర్‌ట్యాక్స్ ఏఐ ఆవిష్కరణ.. తెలుగుతో సహా పలు భాషల్లో ఐటీఆర్ ఫైలింగ్ సులభతరం..! 

  4. Srisailam : శ్రీశైలం కు భారీగా వరద పోటు.. గేట్లు ఎత్తేందుకు సిద్ధమైన అధికారులు.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు