నో ఆబ్జెక్షన్ లేకుండా పరిశ్రమలకు ఈపాస్ అనుమతులు.. రైతుల పొలాలకు నష్టం..!
నో ఆబ్జెక్షన్ లేకుండా పరిశ్రమలకు ఈపాస్ అనుమతులు.. రైతుల పొలాలకు నష్టం..!
మందమర్రి రూరల్, మనసాక్షి :
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో (ఇండస్ట్రియల్) రైస్ మిల్ ఇటుకల కంపెనీల అనుమతులకై ఈపాస్ లో దరఖాస్తులు. పత్రాలు పరిశీలించని అధికారులు. ఈపాసు దరఖాస్తుదారులో ఏ ఏ పత్రాలు సమర్పిస్తున్నారో చూసుకొకుండా అనుమతులు ఇస్తున్నారు.
అదే తరహాలో కాలుష్య నివారణ బోర్డు వాళ్లు కూడా ఈపాస్ లోనే అనుమతులు ఇస్తున్నారు. కానీ సదరు కంపెనీ ఏర్పాటు చేస్తున్న స్థలం చుట్టూ ఎంత మేరా కాలుష్యానికి గురి అవుతుందనేది కాలుష్యం నివారణ బోర్డు వాళ్ళు కంపెనీ ఏరియాను పరిశీలించకుండా అనుమతులు ఇవ్వడంతో కంపని ఏరియాలోని చుట్టుపక్కల రైతులుపంటలను నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
కాలుష్య నివారణ అధికారులు అనుమతులు ఇవ్వడానికి ముందు కంపెనీ చుట్టుపక్కల రైతుల నుండి నో అబ్జెక్షన్ అనుమతి పత్రం తీసుకొని అనుమతులు ఇస్తే బాగుంటుందని గ్రామస్తులు తెలిపారు. అలాగే గ్రామపంచాయతీ ఏరియాలో కంపెనీ ఏర్పాటుకు నో అబ్జెక్షన్ పత్రం తీసుకొని గ్రామపంచాయతీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది.
కానీ కాలుష్య నియంత్రణ అధికారులు అనుమతులు ఇవ్వడంతో గ్రామపంచాయతీ అదికారులు కూడా అలానే అనుమతులు ఇస్తున్నారు. తర్వాత రైస్ మిల్ ఇటుకల కంపెనీ లాంటి కంపంపనీ ఏర్పాటు చేసుకున్న తర్వాత చుట్టుపక్కల రైతులకు సంబందించిన పంటలు నష్టపోయి రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు.
కంపెనీ ఏర్పాటు చేసిన తర్వాత రైతులు ఎవరి దగ్గరికి వెళ్లాలో ఎవరితో చెప్పుకోవాలో తెలియని పరిస్థితినెలకొందన్నారు. పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటున్నా రైతులు పట్టణాలకు వెళ్లి అధికారుల చుట్టు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.
ఏ ఆఫీసుకు వెళ్ళాలో తెలియడం లేదన్నారు. కాబట్టి రైతులు నష్టపోతూనే ఉంటున్నారు. కాబట్టి ఈ పాస్ లో అనుమతులు ఇవ్వకుండా కంపెనీ ఏర్పాటు చేసే ప్రదేశాన్ని సందర్శించి ఎవరికీ ఎటువంటి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని రైతులు తెలుపుతున్నారు.
ఇప్పటికైనా అంబందిత అధికారులుస్పందించి మందమర్రి మండలంలోని వివిధ గ్రామాలలో ఏర్పాటు చేసిన ఇటుకల కంపెనీలను రైస్ మిల్లులను సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
MOST READ :
-
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!
-
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్లకు మీరు అర్హులేనా.. సర్వేలో అంశాలు ఇవే..!
-
Nalgonda : నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం.. లక్ష మందితో బహిరంగసభ.. మంత్రి కోమటిరెడ్డి..!









