ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
ACB : లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
పంచాయతీ కార్యదర్శి 15 వేల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన సంఘటన సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో చోటుచేసుకుంది. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం మహాదేవ్ పల్లి గ్రామపంచాయతీ కార్యదర్శి ఉమేష్ 15 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.
కల్హేర్ మండలం మహాదేవ్ పల్లి గ్రామానికి చెందిన కార్యదర్శి ఉమేష్ వద్దకు మాసన్ పల్లి గ్రామానికి చెందిన బాధితుడు ఫిష్ స్టాల్ పెట్టుకునేందుకు బ్యాంకు లోన్ కోసం వెళ్ళాడు. కాగా బ్యాంకు అధికారులు గ్రామ కార్యదర్శి తో నో డ్యూ సర్టిఫికెట్ కావాలని అడిగారు.
బాధితుడు నో డ్యూస్ సర్టిఫికెట్ కోసం గ్రామపంచాయతీ కార్యదర్శి ఉమేష్ ను సంప్రదించాడు. తనకు 15 వేల రూపాయలు లంచం ఇస్తే నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తానని ఉమేష్ తెలపడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
కాగా శుక్రవారం కల్హేర్ ఎంపీపీ కార్యాలయంలో 15 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పంచాయతీ కార్యదర్శి ఉమేష్ ని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతనిని నాంపల్లి కోర్టులో సరెండర్ చేశారు.
MOST READ :
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!
-
WhatsApp : వాట్సాప్ కాల్స్ మాట్లాడుతున్నారా.. అయితే చిక్కుల్లో పడ్డట్టే, ఈ జాగ్రత్తలు తీసుకోవాలి..!
-
Nalgonda : నల్గొండ జిల్లాకు శాశ్వత పరిష్కారం.. లక్ష మందితో బహిరంగసభ.. మంత్రి కోమటిరెడ్డి..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై అదిరిపోయే గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన..!









