తెలంగాణBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!

Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!

మన సాక్షి, హైదరాబాద్ :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతుల ఖాతాలలో డబ్బులు జమవుతున్నాయి. జూన్ 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని రైతు భరోసా నిధులు విడుదల చేశారు. తొలిరోజు రెండు ఎకరాల వరకు పంటలు సాగు చేసిన రైతులకు రైతు భరోసా నిధులు ఖాతాలలో జమ చేశారు.

ఇది ఇలా ఉండగా తాజాగా గురువారం 5 ఎకరాల వరకు పంటలు సాగు చేసే రైతులకు రైతు భరోసా డబ్బులు వారి వారి ఖాతాలలో జమ చేశారు. అందుకుగాను 1189.43 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దాంతో 4, 43, 167 మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62.47 లక్షల మంది రైతుల ఖాతాలలో 6404.47 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది. ఇప్పటివరకు 1.06 కోట్ల ఎకరాలకు పంట సహాయం అందింది.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

  2. Rythu Bharosa : రైతు భరోసా.. ఆ రైతులకు డబుల్ బోనంజా.. లేటెస్ట్ అప్డేట్..!

  3. District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

  4. Holiday : స్కూళ్లు, కాలేజీలకు శుక్రవారం సెలవు.. సడన్ గా నిర్ణయం..!

మరిన్ని వార్తలు