Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsఉద్యోగంజిల్లా వార్తలుములుగు జిల్లా

District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

ములుగు, మన సాక్షి

ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులు జిల్లా కేంద్రంలోని టాస్క్ రీజినల్ సెంటర్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందారని, వారికి ఈనెల 19న జాబ్ మేళా నిర్వహించి వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, పీజి పూర్తిచేసిన విద్యార్థులకు ప్రైవేటు రంగములో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు గాను బుధవారం ఉదయం 10గంటలకు టాస్క్ రీజినల్ సెంటర్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించను న్నామన్నారు.

నిరుద్యోగ యువతలో ప్రతిభ నైపుణ్యాలు పెంపొందించడానికి టాస్క్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరిగిందని, శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు హైదరాబాద్, ములుగు, వరంగల్ లలోని సాబిక్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, సీఏఎస్ఎస్4యూ, టాటా స్ట్రీవ్, జస్ట్‌డియల్, జహ్నావి కమ్యూనికేషన్, హెడ్డీబీ ఫైనానెన్స్, షాన్ముక్ బయో ఆర్గానిక్స్, ముథూట్ మైక్రోఫిన్ లిమిటెడ్, శ్రీరామ్ ఫైనాన్స్, పేటీఎం,

ఆదిత్య ఆర్గానిక్ ఈసిఓ టెక్నాలజీ, ఎస్ఎస్ఎస్వీ సొల్యూషన్స్, కేపీఆర్ డెవలపర్ల కంపెనీ లలో ట్రైనీ, ప్రాసెస్ అసోసియేట్, హెచ్ఆర్ రోల్స్, ట్రైనీలు, బీడీఈ, ప్లేస్‌మెంట్ మేనేజర్, నాన్ వాయిస్ ప్రాసెస్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, డిజిటల్ మీడియా ఎగ్జిక్యూటివ్స్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, ఫుడ్ అండ్ పానీయాలు స్టీవార్డ్, ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్, టెలి సేల్స్, హెచ్ఆర్ రిక్రూటర్లు అండ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ఆఫీసర్లు, తదితర ఖాళీలను కంపెనీ ప్రతినిధులు భర్తీ చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు.

ఈ జాబ్ మేళా అవకాశాన్ని జిల్లా కేంద్రం లోని టాస్క్ రీజినల్ సెంటర్ లో టెక్నికల్, నాన్ టెక్నికల్ కోర్సులలో శిక్షణ పొందిన నిరుద్యోగ యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలని, కుటుంబానికి తోడ్పాటుగా ఉండాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ములుగు టాస్క్ సెంటర్ కోఆర్డినేటర్ మురళిని 9618449360 లో సంప్రదించాలని సూచించారు.

MOST READ : 

  1. WhatsApp : వాట్సప్ సంచలన నిర్ణయం.. ఇక సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు.. తెలుసుకోండి..!

  2. Mahalakshmi : తెలంగాణలో మహిళలకు నెలకు రూ.2500.. వారే అర్హులు.. ఎప్పటినుంచంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  3. Rythu Bharosa : మూడు ఎకరాల లోపు రైతుల ఖాతాలలో రైతు భరోసా జమ.. బిగ్ అప్డేట్..!

  4. KTR : మళ్లీ చెప్తున్నా.. ఇది లొట్టపీసు కేసే.. కేటీఆర్..!

మరిన్ని వార్తలు