Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలురాజకీయంహైదరాబాద్

KTR : మళ్లీ చెప్తున్నా.. ఇది లొట్టపీసు కేసే.. కేటీఆర్..!

KTR : మళ్లీ చెప్తున్నా.. ఇది లొట్టపీసు కేసే.. కేటీఆర్..!

మన సాక్షి, హైదరాబాద్ :

న్యాయస్థానాలపై నమ్మకం ఉన్న వ్యక్తిగా ఎన్నిసార్లు పిలిచినా మళ్లీ విచారణకు వెళ్తాను. 9 గంటల విచారణ లో ఒకటే ప్రశ్న.. అటు తిప్పి, ఇటు తిప్పి అడుగుడు. ఒక్క రూపాయి కాదు పైసా అవినీతి కూడా జరగలేదు. ఇక్కడి నుంచి పైసా పోయింది. అక్కడ ఉన్నది. ఇందులో అవినీతి ఎక్కడ ఉందని ఏసీబీ అధికారులను అడిగితే సమాధానం లేదు.

పనికిమాలిన ప్రశ్నలు తప్ప.. చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలు తప్ప.. ఏం లేదు అని మాజీ మంత్రి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయనను సుమారు 9 గంటల పాటు ఏసీబీ విచారణ చేసింది. ఈ ఫార్ములా కార్ రేస్ విషయంలో ఆయనపై కేసు నమోదు కాగా సోమవారం ఏసీబీ అధికారులు ఆయనను విచారించారు. విచారణ పూర్తయిన అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ మొన్న చెప్పిన.. ఇవాళ చెప్పినా.. ఇది లొట్ట పీస్ కేసు.. ఈయన లొట్ట పీస్ ముఖ్యమంత్రి, వీళ్ళతోని ఏది కాదు. పరిపాలన చేతకాదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ధైర్యం లేదు. దద్దమ్మ రాజకీయంతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ కమిషన్ ముందు పిలిచారు. అంతకుముందు హరీష్ రావును పిలిచారని కేటీఆర్ గుర్తు చేశారు. మా ఆర్ఎస్ ప్రవీణ్ అన్న చెప్పిండు. నా చరిత్రలో ఇంత తుఫెల్ కేసు ఎప్పుడు చూడలేదని. 26 సంవత్సరాలు ఐపీఎస్ అధికారిగా పనిచేసినా ఇలాంటి కేసు చూడలేదు అన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఫార్ములా కార్ రేస్ పై చర్చ పెట్టాలని అడిగితే రేవంత్ రెడ్డి పారిపోయిండని, ఫార్ములా ఈ రేస్ పై నేనేదో తప్పు చేసినా.. కేసీఆర్ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని అంటున్నావు కదా.. దమ్ముంటే చర్చ పెట్టు అని అసెంబ్లీలో పట్టుపడితే పారిపోయిందని కేటీఆర్ అన్నారు. అవసరమైతే లై డిటెక్టర్ పరీక్ష చేయించుకుంటా నువ్వు కూడా రా అంటే పత్తలేడని మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి : 

  1. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడ్డాయి.. చెక్ చేసుకోండి.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Gunde Ninda Gudigantalu : ఇలా రా.. తలుపు వేయి.. రోహిణి గొంతు పట్టిన ప్రభావతి.. (ఎపిసోడ్ 16 జూన్)

  3. Nalgonda : వీడు మామూలోడు కాదు.. బంగారం పేరుతో ఘరానా మోసం..!

  4. Alumni : 34 సంవత్సరాల తర్వాత అందరు ఒకేచోట..!

  5. District collector : రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ రైతు నేస్తం లో ముఖాముఖి..!

మరిన్ని వార్తలు