Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

District collector : 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

District collector : 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 9,10 తేదీలలో నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమం సందర్భంగా ఆదివారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం, వాడపల్లిలో ఓటరూ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.

ఇప్పటి వరకు ఓటరు జాబితాకు సంబంధించి చేసిన మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు ఎంతవరకు పూర్తయిందని, మాన్యువల్ గా, అలాగే ఆన్‌లైన్ఎం లో ఎంత శాతం పూర్తి చేశారని బిఎల్ఓ ల ద్వారా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. అదేవిధంగా ఓటరు జాబితాలో చనిపోహీన, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్ల తొలసగింపు పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, మార్పుచేర్పుల దరఖాస్తు ఫారాలు జాగ్రత్తగా పరిశీలించి పరిష్కరించాలని అన్నారు.

అనంతరం వాడపల్లిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద ఖాళీగా ఉన్న స్థలంలో కళ్యాణ మండపం, తదితర దేవాలయ అభివృద్ధికి గాను పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్ ద్వారా
అంచనాలను రూపొందించి పంపించాలని ఎంపీడీవోను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట తహసిల్దార్ జవహర్ లాల్, ఎంపీడీవో మూర్తి, వాడపల్లి స్పెషల్ ఆఫీసర్ నాగరాజు, దేవాలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జ్యోతి, గ్రామ కార్యదర్శి శేఖర్, తదితరులున్నారు.

LATEST UPDATE : 

మరిన్ని వార్తలు