Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తు చేసుకున్నారా.. వ్యవసాయ శాఖ గుడ్ న్యూస్.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు పంటలు సాగు చేస్తున్న రైతులకు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ అయింది.
ఇలా ఉండగా రైతులకు వ్యవసాయ శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2025 జనవరి 31 వ తేదీ వరకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారి నుంచి రైతు భరోసా దరఖాస్తులు స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన వారు ఉన్నారు. అయితే వారికి కూడా ఈ పంట సీజన్ లోనే ఒక విడత రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని వ్యవసాయ శాఖ తెలియజేసింది.
ఇప్పటివరకు గతంలో రైతు బంధు పొందిన రైతులకు మూడు ఎకరాల వరకు పంట సహాయం అందజేశారు. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు పంట సహాయం అందలేదు. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొత్త దరఖాస్తుదారులకు వంట సహాయం అందజేస్తారా..? లేదా..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా తాజాగా వ్యవసాయ శాఖ కీలకమైన ప్రకటన చేసింది. కొత్తగా దరఖాస్తులు చేసుకున్న రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందజేయనున్నట్లు ప్రకటించింది.
కొత్త దరఖాస్తుదారుల బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. ఆయా బ్యాంకుల నుంచి క్లియరెన్స్ రాగానే అర్హులైన వారిని గుర్తించి పంట పెట్టుబడి సహాయం అందజేయనున్నట్లు తెలిపింది. గతంలో మాదిరిగానే ఈసారి కూడా తక్కువ విస్తీర్ణంలో నుంచి ఎక్కువ విస్తీర్ణం లో ఉన్న భూములకు నిధులను విడుదల చేస్తున్నారు. కొత్త దరఖాస్తులకు కూడా అదే విధంగా నిధులు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
■ Similar News :
- Rythu Bharosa : రైతు భరోసా గందరగోళం.. వారికి రానట్లేనా.. అధికారులు ఏమంటున్నారంటే..!
- Rythu Bharosa : రైతులకు భారీ గుడ్ న్యూస్.. మూడు ఎకరాల లోపు రైతులకు రైతు భరోసా నిధులు విడుదల..!
- Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ కాలేదా.. అయితే ఇలా చేయండి..!
- Rythu Bharosa : రైతులకు భారీ షాక్.. వారికి రైతుభరోసా కట్..!
- Rythu Bharosa : రైతు భరోసా మళ్లీ ఎప్పుడంటే.. డేట్ ఫిక్స్.. బిగ్ అప్డేట్..!









