TOP STORIESBreaking Newsజాతీయంవ్యవసాయం

Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!

Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

దేశవ్యాప్తంగా రైతులందరికీ ఆధార్ కార్డు తరహా లో ఫార్మర్ రిజిస్ట్రీ కార్డును అందజేయనున్నారు. 11 అంకెలతో ఈ విశిష్ట కార్డు కోసం ప్రతి రైతు వ్యవసాయ శాఖ కార్యాలయంలో నమోదు చేసుకోవాల్సి ఉంది. వ్యవసాయశాఖ కార్యాలయాలతో పాటు మీ సేవ కేంద్రాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో ఈ కార్డు లేకుంటే కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ సంక్షేమ పథకాలు అందవు.

ఈ ప్రక్రియ తెలంగాణలో సోమవారం నుండి ప్రారంభమైంది. అధికారులు వివరాలు నమోదు చేసుకుంటున్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్, పంటల బీమా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అయితే సరైన వివరాలు లేకపోవడం వల్ల రైతులకు సకాలంలో పథకాలు అందడం లేదని గుర్తించింది. భూములు, పంటల వివరాలు, ఈ కార్డులో ఉంటాయి. పత్తి రైతుకు డిజిటలైజేషన్ గుర్తింపు కార్డును జారీ చేయనున్నారు.

ఇప్పటి వరకు దేశం లో 19 రాష్ట్రాలలో కేంద్రంతో ఒప్పందం చేసుకొని నమోదు ప్రక్రియ చేపట్టారు. కాగా తెలంగాణలో వాయిదా పడుతూ వస్తున్న ఈ కార్యక్రమం సోమవారం ఫార్మర్ రిజిస్టర్ పేరుతో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు.

సంగారెడ్డి జిల్లాలో నమోదు చేస్తున్న వ్యవసాయ అధికారులు

ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?

ఫార్మర్ రిజిస్ట్రీ సంఖ్య నమోదుకు భూయాజమాన్య పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తో మండల వ్యవసాయాధికారి గాని ఏఈఓ వద్ద గాని నమోదు చేసుకోవాలి. నమోదు అయ్యాక లబ్ధిదారులకు ఓటిపి వస్తుంది. దాని ధ్రువీకరణ ద్వారా సంఖ్య కేటాయిస్తారు. ఆ సంఖ్యను కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుతో అనుసంధానం చేయనున్నారు. పిఎం కిసాన్ లో తదుపరి నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకోనున్నారు.

రాష్ట్ర పథకాలకు సంబంధం లేదు :

కేంద్ర ప్రభుత్వం జారీ చేసే 11 అంకెలు గల ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో రాష్ట్రం అమలు చేసే పథకాలకు ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్రంలో అమలవుతున్న రైతు భరోసా, రుణమాఫీ, ఇతర పథకాలకు ఈ సంఖ్య అవసరం లేదు. రెవిన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలే ప్రామాణికంగా వ్యవసాయ శాఖ తీసుకోనున్నదని రాష్ట్రం స్పష్టం చేసింది.

MOST READ : 

  1. Farmer Registry : రైతు గుర్తింపు కార్డుల నమోదు ప్రక్రియ ప్రారంభం.. ధరఖాస్తు ఇలా..!

  2. GPay Loan : రెండు నిమిషాల్లో గూగుల్ పే రూ.12 లక్షల వరకు లోన్.. ఎలాంటి పత్రాలు అవసరం లేదు..!

  3. Gold Price : నిలకడగా బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై అన్నదాతకు శుభవార్త.. రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!

  5. Miryalaguda : మిర్యాలగూడలో సౌండ్స్ ఆఫ్ మంగ్లీ లైవ్ ఇన్ కాన్సెప్ట్ మ్యూజికల్ నైట్..!

మరిన్ని వార్తలు