KTR : నల్గొండ జిల్లా ముసంపల్లి రైతు వీడియో చూసి చలించి.. నేరుగా ఆయనను కలిసిన కేటీఆర్..!

పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని , మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలన్న మల్లయ్య.  మల్లయ్య విడియో చూసి చలించిపోయిన KTR..

KTR : నల్గొండ జిల్లా ముసంపల్లి రైతు వీడియో చూసి చలించి.. నేరుగా ఆయనను కలిసిన కేటీఆర్..!

నల్గొండ మన సాక్షి :

నల్గొండ మండలం, ముషంపల్లి గ్రామంలో రైతు గన్నెబొయిన మల్లయ్యను, బోర్ల రాంరెడ్డిలను కలిసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… మాజీ మంత్రి జగదీష్ రెడ్డి..

 పంటలు అన్ని ఎండిపోయి అప్పుల పాలయ్యామని, కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు రైతులు బాగున్నారని , మళ్ళీ కేసీఆర్ గారే సీఎం కావాలన్న మల్లయ్య. 

మల్లయ్య విడియో చూసి చలించిపోయిన KTR..

నల్గొండ వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తా అని ట్విట్టర్ లో పెట్టిన కేటీఆర్..

ఇచ్చిన మాట నిలుపుకుంటు సోమవారం ముషంపల్లి గ్రామంలో రైతు మల్లయ్య ను కలిసిన కేటీఆర్..

కేటీఆర్ కామెంట్స్ :

ఆనాటి తెలంగాణ రైతుల దుస్థితికి, అవస్థలకి చిహ్నంగా నిలిచిన బోర్ల రామిరెడ్డిని, ఆయన దీన పరిస్థితిని కేసీఆర్ గారు వందల సార్లు చెప్పారు

ముచంపల్లికి చెందిన రాంరెడ్డి గారి పేరు బోర్ల రామిరెడ్డిగా మారింది

గండేపోయిన మల్లయ్య యాదవ్, బోర్ల రామిరెడ్డి గారి పరిస్థితులు తెలుసుకున్న తర్వాత మనసున్న ప్రతి ఒక్కరికి బాధ కలుగుతుంది

అందుకే మల్లన్నను ప్రత్యేకంగా కలిసేందుకు ఈరోజు ముషంపల్లికి రావడం జరిగింది

రామ్ రెడ్డి అన్నను కలిసినా, మల్లన్నను కలిసినా, కొంతమంది మహిళలను కలిసినా, గత పది సంవత్సరాలలో ఏ రోజు తాగునీటికి, సాగునీటికి కొరత రాలేదని చెప్పిరు

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలు ఎండిపోయినయ్, తాగునీరు దొరకని పరిస్థితి ఉందని తమ దినావస్థను చెప్పుకుంటున్నారు

ఇది కాలం తెచ్చిన కరువు కాదు, అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ప్రతి ఒక్కరు చెబుతున్నారు

ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టును విపల ప్రాజెక్టుగా చూపించాలని… రిజర్వాయర్లలో నీళ్ళు నింపకుండా ఈ ప్రభుత్వం నాటకాలు ఆడింది

కానీ కేసీఆర్ పర్యటన భయంతో నంది పంప్ హౌస్లో ఎల్లంపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోసి కరీంనగర్ కి నీళ్లు వదిలినారు

నిన్నటిదాకా కాలేశ్వరం ఫెయిల్ అయిందని చెప్పి కానీ ఇదే రోజు అదే బాహుబలి మోటార్ల తో కరీంనగర్ కి నీళ్లు అందిస్తున్నారు

కెసిఆర్ ఉన్నన్ని రోజులు నాగార్జునసాగర్ నుంచి మొదలుకొని… Tailend దాకా ప్రతి ఒక్కరికి సాగునీరు అందింది

గత పది సంవత్సరాలలో ఏనాడు ఒక బోరు వెయ్యాల్సిన పరిస్థితి రాలేదు

కానీ గత నాలుగు నెలల్లో ఆరు బోర్లు వేసిన పరిస్థితి ఉందని రాంరెడ్డి చెప్పారు

ఇది ఈరోజు రైతాంగం పరిస్థితి దారుణంగా ఉంది..

చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వల్ల కలిగినది ఈ దుస్థితి

వంద పది రోజులు అయినా కూడా… నీళ్లు అందించలేని అసమర్థ పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చింది

కేవలం కేసీఆర్ గారిని బద్నాం చేయాలన్న దుర్మార్గ పూరిత, చిల్లర తాపత్రయంతో లక్షల మంది రైతుల పంటలను ఎండబెట్టింది

ఎక్కడెక్కడ అయితే పంట నష్టం జరిగిందో అక్కడ ఎకరానికి 25వేల రూపాయలు పంట నష్టం అందించాలి

ఇది మీరు తెచ్చిన కరువు… మీరు తెచ్చిన దుస్థితి.. కాబట్టి మీరు పరిహారం వెంటనే చెల్లించాలి

ఇప్పటివరకు ముఖ్యమంత్రి, కానీ ఒక్క మంత్రి కానీ రైతుల వద్దకి వెళ్లి పరామర్శించిన పాపాన పోలేదు

కానీ ప్రధాన ప్రతిపక్షంగా మేము, మా నాయకుడు కేసీఆర్ గారు తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా మూడు నాలుగు జిల్లాలు తిరిగి రైతులకు పరామర్శించి ధైర్యం చెబుతున్నారు

రైతాంగానికి ధైర్యం చెప్పే బాధ్యత ప్రభుత్వానికి లేదా

ముఖ్యమంత్రి ఎక్కడున్నాడు… సమాధానం చెప్పాలి

రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన పొంకణాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి ఎక్కడ పోయిండు

వెంటనే రుణమాఫీ చేయనందుకు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి

రాష్ట్ర రైతాంగం పక్షాన మా పార్టీ కొట్లాడుతుంది

ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం

రైతులు గుండె చెదురవద్దని, ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం

వెంటనే క్వింటాల్ కి 500 రూపాయల బోనస్ ని అందించాలి

రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైన ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఒత్తిడి తీసుకువస్తాం

ఉత్తంకుమార్ రెడ్డి సమస్యను పరిష్కరించకుండా ఉత్త మాటలు మాట్లాడుతున్నాడు

రేవంత్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రులంతా కూడా రాజకీయ చేరికల పైన దృష్టి పెట్టారు కానీ రైతాంగం సమస్యల పైన కాదు

స్వయంగా ముఖ్యమంత్రి కేశవరావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా కరెంటు పోయింది

ఉత్తంకుమార్ రెడ్డి ఎంత బుఖాయించిన వాస్తవాలు వాస్తవాలే గాని అబద్ధాలు కావు

రాష్ట్ర మంత్రులకు దమ్ము ధైర్యం ఉంటే రైతుల ముందుకు వచ్చి కరెంటు కోతలు సాగునీటి కొరత లేదని చెప్పాలి

ఇదే మాట ముచంపల్లికి వచ్చి రైతులతో చెప్పాలని మంత్రులకు సవాలు విసిరిన కేటీఆర్.

ALSO READ :

BIG BREAKING : కేటీఆర్ పై క్రిమినల్ కేసు నమోదు..!

Telangana New Ration Cards Process : కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జారీ అప్పటి నుంచే..!

KCR : ఫాఫం కేసీఆర్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడు నెలల ముచ్చటగా కారు పార్టీ కథ..!