BREAKING : మిర్యాలగూడలో సంగం డైరీ వద్ద రైతుల ఆందోళన.. ఉద్రిక్తత..!
BREAKING : మిర్యాలగూడలో సంగం డైరీ వద్ద రైతుల ఆందోళన.. ఉద్రిక్తత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాస్ నగర్ లో ఉన్న సంగం డైరీ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. బుధవారం సంఘం డైరీ ప్రారంభోత్సవాన్ని అడ్డుకున్నారు. తమ డబ్బులు చెల్లించి ప్రారంభోత్సవం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
గతంలో ఆ డైరీ వీటి డైరీ పేరుతో నడిచింది. అది దివాలా తీయడంతో బ్యాంకుల నుంచి తీసుకున్న అప్ప సైతం ఎగ్గొట్టింది. దాంతో బ్యాంకులు వేలంపాట నిర్వహించి వీటి డెయిరీ విక్రయించారు. వేలంపాటలో సంఘం డైరీ వారు కొనుగోలు చేశారు. బుధవారం ప్రారంభోత్సవ వేడుక నిర్వహించింది. ఈ విషయం తెలుసుకున్న రైతులు డైరీ వద్దకు భారీగా చేరారు.
పాత బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కానీ సంఘం డైరీ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళనకు దిగారు. పాత కంపెనీ వీటి డైరీ కి తాము పాలు పోశామని రైతులకు డబ్బులు చెల్లించకుండా కొత్త యాజమాన్యం ఎలా ప్రారంభోత్సవం చేస్తారంటూ డిమాండ్ చేశారు.
డైరీ లోపలికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించారు. డైరీ వద్ద రైతులు ఆందోళన చేస్తుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రైతుల ఆందోళనలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితిలో నెలకొన్నాయి.
బ్యాంక్ అధికారులు సంఘం డైరీ యాజమాన్యం కుమ్మక్కై మాకు అన్యాయం చేస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని రైతుల డిమాండ్ చేస్తున్నారు.
LATEST UPDATE :
Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు పూచీకత్తు ఎవరిచ్చారో తెలుసా..!
మిర్యాలగూడ : ప్రైవేట్ ఆస్పత్రుల్లో సీఎంఆర్ఎఫ్ స్కాం.. అరెస్టుకు సిద్ధమైన సిఐడి..!
తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!
Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!









