Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsతెలంగాణ

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు పూచీకత్తు ఎవరిచ్చారో తెలుసా..!

Mlc Kavitha : ఎమ్మెల్సీ కవితకు పూచీకత్తు ఎవరిచ్చారో తెలుసా..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్టు అయ్యి తిహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంగళవారం రాత్రి విడుదలయ్యారు. ఆమెకు సుప్రీంకోర్టు సిబిఐ, ఈడి కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆమెకు కండిషన్ మంజూరు చేసింది. 10 లక్షల రూపాయల ఇద్దరి పూచికత్తుతో పాటు పాస్ పోర్టును అందజేయాలని నిబంధనలు విధించింది.

దాంతో అన్ని నిబంధనలు పూర్తయ్యాక మంగళవారం రాత్రి 9.10 గంటలకు జైలు నుంచి ఆమెను విడుదల చేశారు. ఇంతకీ ఆమెకు పూచికత్తు ఎవరు ఇచ్చారంటే.. సుప్రీంకోర్టు సిబిఐ కేసులో రూ.10 లక్షలు, ఈడి కేసులో రూ.10 లక్షల చొప్పున పూ కత్తితో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కాగా ఆ మొత్తాలను ఒకరు కవిత భర్త అనిల్, మరొకరు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర చెల్లించారు. రౌస్ ఎవెన్యూ కోర్టులో పూచికత్తు సొమ్మును జమ చేశారు. అనంతరం 4. 20 గంటలకు కవిత రిలీజ్ వారంట్ ను జారీచేసింది. ఆ రిలీజ్ వారెంట్ కాపీని అనిల్, వద్దిరాజులు తీహార్ జైలు సిబ్బందికి అందజేశారు. ఆ తర్వాత నిబంధనలు పూర్తయ్యాక 9.10 గంటలకు ఆమెను జైలు అధికారులు విడుదల చేశారు.

LATEST UPDATE : 

హత్య చేయాలంటే వణుకు పుట్టేలా.. హత్య కేసులో ఎల్బీనగర్ కోర్టు సంచలన తీర్పు..!

HYDRA : హైడ్రా బుల్డోజర్లు జన్వాడ ఫామ్ హౌస్ వైపేనా.. అధికారుల కొలతలు ప్రారంభం..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

తెలంగాణలో రేషన్ డీలర్ల ఖాళీలు భర్తీ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..!

Cm Revanth : పేదలకు సన్న బియ్యంతో పాటు అవి కూడా పంపిణీ.. తేదీ ఫిక్స్..!

మరిన్ని వార్తలు