Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!
Rythu Bharosa : పంట పండించే రైతులకే రైతు భరోసా.. మంత్రి తుమ్మల సంచలన వ్యాఖ్యలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరానికి 15వేల రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేస్తామని ప్రకటించారు. కానీ అధికారంలోకి వచ్చి 9 మాసాలకు పైగా గడిచినప్పటికీ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించలేదు. ప్రస్తుత వానాకాలం సీజన్ లో కూడా రైతులు పంటలు సాగు చేసుకున్నా.. ఇప్పటివరకు రైతు భరోసా అందించలేదు.
రైతుబంధు పథకంలో లోపాలను సరిదిద్ది రైతు భరోసా ప్రారంభిస్తామని అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దాంతో రైతు భరోసా పథకం యొక్క విధి విధానాలపై రాష్ట్రవ్యాప్తంగా రైతుల అభిప్రాయాలను సేకరించారు. రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ నెల 20న శుక్రవారం నిర్వహించే మంత్రి మండలి సమావేశంలో రైతు భరోసా పథకం పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాగా రైతు భరోసా పై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా పథకాన్ని పంట పండించే రైతులకే అందజేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
కౌలు రైతులకా.. యజమానికా.. రైతు భరోసా ఇవ్వాలనే విషయంపై వారు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రైతు భరోసా పథకం పైన భూ యజమానులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. పంట ఎవరైతే పండిస్తారో వారికే ఆర్థిక చేయూత ఇవ్వాలని అందరూ చెబుతున్నారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో మాదిరిగా కౌలు రైతు ఒప్పందాలు తెలంగాణలో లేవని, ఇక్కడ భూ చట్టాలు వేరు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భూ చట్టాలు వేరని ఆయన తెలిపారు. ఇసుక మేటలు, గండ్లు పడితే నష్టపోయిన పరిహారాన్ని భూ యజమానులు తీసుకోవాలని, కేవలం పంట నష్టం మాత్రమే జరిగితే కౌలు రైతుకు ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. రైతు బంధు ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే విషయం పైన ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
రెండు లక్షల లోపు పంట రుణాలను 22 లక్షల మందికి 18 వేల కోట్ల రూపాయలు మాఫీ చేసినట్లు తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఐదేళ్లపాటు రైతులకు రుణమాఫీ చేయకుండా ఎన్నికల కోడ్ వచ్చేముందు ఓ ఆర్ ఆర్ ను తాకట్టుపెట్టి 20 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందన్నారు. అదే విధంగా రైతులకు పంటల బీమా పథకాన్ని కూడా వచ్చే పంట కాలం నుంచి ప్రభుత్వమే భీమా చెల్లిస్తుందని, అందుకు 3000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని తుమ్మల పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Rythu Bharosa : రైతులకు అదిరే శుభవార్త.. ఎకరానికి 15000, రైతు భరోసా డేట్ ఫిక్స్..!
-
Miryalaguda : మిర్యాలగూడలో రూ.180 కోట్లతో నాలుగు అండర్ పాస్ ల నిర్మాణం.. భూమి పూజ చేసిన కోమటిరెడ్డి..!
-
దసరా సెలవుల డేట్స్ ఇవే.. ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
-
Narayanpet : రైతులకు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
-
TG News : మీ ఎమ్మెల్యే మీ ఊరిలో.. ఆ ఎమ్మెల్యే వినూత్నకార్యక్రమానికి శ్రీకారం..!










