తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!

District collector : రైతు భరోసా దరఖాస్తులకు రేపటితో ముగియనున్న గడువు.. రూ.516 కోట్లు రైతుల ఖాతాలో జమ..!

నల్గొండ,  మన సాక్షి :

రైతు భరోసా కింద నల్గొండ జిల్లాలో గురువారం నాటికి 4 లక్షల 75 వేల మంది రైతుల బ్యాంకు ఖాతాలలో 516 కోట్ల రూపాయలు జమ అయినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు. రైతు భరోసా కింద నల్గొండ జిల్లాకు రాష్ట్రంలోనే అత్యధికంగా నిధులు వచ్చాయని, మొత్తం 5 లక్షల 65 వేల 803 మంది రైతులకు 738 కోట్ల 67 లక్షల 60 వేల రూపాయలు వచ్చినట్లు ఆమె తెలిపారు.

రైతు భరోసా కింద రైతుల బ్యాంకు ఖాతాలలో జమ అయిన మొత్తాలను రైతులు ఎరువులు ,వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ పనులకువినియోగించాలని కోరారు. అలాగే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు ఈ నెల 20( శుక్రవారం) లోగా రైతు భరోసా కై దరఖాస్తు చేసుకోవాలని ,ఇందుకుగాను బ్యాంకు పాస్ బుక్ , పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను రైతు వేదికలలో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలని తెలిపారు.

వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు భరోసా కై కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన రైతులనుండి వచ్చిన దరఖాస్తులను శుక్రవారం రాత్రి 8 గంటల లోపు
ఆన్ లైన్ డేటాను పూర్తి చేయాలని, ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతు భరోసా వారికి కూడా.. ఖాతాలలో జమ.. చెక్ చేసుకోండి..!

  2. District collector : భూభారతి పై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. చట్ట ప్రకారం సమస్యలు పరిష్కరించాలి..!

  3. Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు పడలేదా.. నో టెన్షన్.. ఇలా చేయండి..!

  4. District collector : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రేపు మెగా జాబ్ మేళా.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!

మరిన్ని వార్తలు