TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా కు కావల్సినవి ఇవే.. వారికే పంట సహాయం.. లేటెస్ట్ అప్డేట్..!

మన సాక్షి , తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులకు పంట సహాయం అందించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించనున్నది. జనవరి 26వ తేదీన (రిపబ్లిక్ డే దినోత్సవం) సందర్భంగా ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. గతంలో ఉన్న రైతుబంధు పథకంలో జరిగిన అవకతవకలను నివారించి నిజమైన రైతులకు, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే వంట సహాయాన్ని అందించేందుకు రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నారు.

ఎకరానికి 12,000 రూపాయలకు చొప్పున వంట సహాయం చేసేందుకు గాను రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తున్నారు. అందులో భాగంగా ఒక విడుతగా ఎకరానికి 6000 రూపాయలను రైతుల ఖాతాలలో నేరుగా జామ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.49 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేసినట్లుగా అధికారుల సర్వేలో వెళ్లడైంది. అందుకుగాను 8900 కోట్ల రూపాయలను రైతులకు పంట సహాయంగా అందించనున్నారు.

కొత్తవారికి అవకాశం :

ఇదిలా ఉండగా కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతులకు కూడా రైతు భరోసా పథకాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 01 జనవరి 2025 నాటికి భూభారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న పట్టాదారుల డేటా ఆధారంగా రైతు భరోసా పథకం కింద అర్హులైన వారికి ఈ పథకాన్ని అందించనున్నది. అందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి అనుమతి కూడా పొందింది. రైతులు వ్యవసాయ క్లస్టర్ అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలని కోరింది

కావల్సినవి :

కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం జిరాక్స్ కాపీని, ఆధార్ కార్డు, బ్యాంకు సేవింగ్ ఖాతా పుస్తకం జీరాక్స్, పూర్తిచేసిన ఫారం సంబంధిత వ్యవసాయ క్లస్టర్ అధికారికి అందజేయాలని కోరింది. దాంతోపాటు బ్యాంకు ఖాతా నెంబర్ల మార్పులు ఉంటే కూడా బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీని అధికారులకు ఇవ్వాలని కోరింది.

వారికే రైతు భరోసా :

కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ప్రారంభించబోయే రైతు భరోసా పథకానికి 01 జనవరి 2025 తేదీ వరకు భూభారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న సమాచారం మేరకే రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకుగాను జనవరి 01 తేదీ వరకు కొత్తగా దరఖాస్తులు పొందిన రైతులను కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

MOST READ : 

  1. TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

  2. Gold Price : మరోసారి భారీగా పెరిగిన గోల్డ్.. ఈరోజు ధర ఎంతంటే..!

  3. Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!

  4. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు