TOP STORIESBreaking Newsవ్యవసాయంహైదరాబాద్

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో జమ.. ముందుగా వారికే.. బిగ్ అప్డేట్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు పెట్టుబడి సహాయం అందించే రైతు భరోసా పథకం డబ్బులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ శుభవార్త తెలిపింది. రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ముందుగా గుంటల వ్యవసాయ భూమి ఉన్న వారి నుంచి ప్రారంభమై ఒక ఎకరం ఉన్న రైతుల వరకు పంట సహాయం అందించనున్నారు.

అయితే జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించిన అధికార యంత్రాంగం మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి కేవలం ఆ గ్రామంలో ఉన్న రైతులకు మాత్రమే నిధులు జమ చేశారు. మిగతా గ్రామాల్లోని రైతులకు రైతు భరోసా నిధులు జమ కాలేదు. అయితే ఈ విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇవాల్టి నుంచి రైతు భరోసా నిధులు జమ చేసే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు.

ఎకరానికి 12 వేల రూపాయల చొప్పున ఒక విడత 6000 రూపాయలను జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకానికి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు. ప్రస్తుతం ఒక విడతకు గాను ముందుగా ఎకరం లోపు ఉన్న రైతులకు పంట పెట్టుబడి సాయం అందనున్నది.

అందుకు గాను ఈరోజు 17.03 లక్షల రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నట్లు మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు భరోసా నిధులు జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

MOST READ : 

  1. Ration Cards : కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. వారికి బియ్యం ఎప్పటినుంచంటే..!

  2. WhatsApp : ఇంటర్నెట్ లేకుండా వాట్సప్ వినియోగం.. చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..!

  3. Holiday : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. ఆ రోజు విద్యాసంస్థలకు సెలవు..!

  4. Gold Price : గోల్డ్.. ఆల్ టైం రికార్డ్.. లేటెస్ట్ అప్డేట్..!

  5. Rythu Bharosa : రైతుల ఖాతాలలో భరోసా డబ్బులు.. ఎప్పటినుంటే.. లేటెస్ట్ అప్డేట్

మరిన్ని వార్తలు