తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండవ్యవసాయం

Miryalaguda : సన్నధాన్యం విక్రయించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్..!

Miryalaguda : సన్నధాన్యం విక్రయించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్..!

మిర్యాలగూడ, మన సాక్షి :

సన్నధాన్యం విక్రయించే రైతులకు ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లిస్తుందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో సన్నధాన్యం కొనుగోలుకు మూడు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో రైతులు ధాన్యం విక్రయించుకొని మద్దతు ధర పొందాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైతు ప్రభుత్వం అధికారంలో ఉందని, రైతులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని అన్నారు. రాబోయే రోజుల్లో రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో తాసిల్దార్ హరిబాబు, స్కైలాబ్ నాయక్, బంటు శ్రీనివాస్, నాగిరెడ్డి, పొదిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Miryalaguda : ఎస్పిఆర్ పాఠశాలలో ఘనంగా మెగా బాల విజ్ఞాన వినోదిని..!

  2. Health : ఎండు చేపలా, పచ్చివా.. ఆరోగ్యానికి ఏవి మంచివి, గుండె జబ్బు వారికి..!

  3. Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..! 

  4. Miryalaguda : మిర్యాలగూడ వాసికి గ్రూప్ 1 లో 6వ ర్యాంకు.. సన్మానించిన మాజీ ఎమ్మెల్యే..!

  5. Life Style: టవళ్లను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలి..!

మరిన్ని వార్తలు