క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణరంగారెడ్డి

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి..!

Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి..!

శంకర్‌పల్లి, (మన సాక్షి) :

బైక్- సిమెంట్ లారీ ట్యాంకర్ ఢీకొని తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా కోట్ పల్లి మండల పరిధిలోని బీరెల్లి గ్రామానికి చెందిన తాండ్ర రవీందర్ (32) సోమవారం మొయినాబాద్ మండల పరిధిలోని తోల్కట్ట గ్రామంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్నది.

తన కూతురు కృప (13) ను వినాయక చవితి పండగ సెలవుల సందర్భంగా ఇంటికి బైక్ పై తీసుకువస్తుండగా మార్గ మధ్యలో చేవెళ్లకు రాగానే హైదరాబాద్ వైపు నుండి వికారాబాద్ వైపు వెళ్తున్న సిమెంట్ లారీ, బైకును ఢీకొట్టగా బైక్ పై ఉన్న తండ్రి కూతురు అక్కడికి అక్కడికే మృతి చెందారు.

పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి వెళ్లి మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తండ్రి, కూతురు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

MOST READ : 

  1. Nalgonda : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన.. వారికి అధునాతన వైద్య సౌకర్యాలు..!

  2. KTR : దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి.. కేటీఆర్ సవాల్..!

  3. School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

  4. Model School : ఈ మోడల్ స్కూల్ కు రాష్ట్రస్థాయి గుర్తింపు.. ట్రైల్ బ్లేజర్స్ పుస్తకంలో చోటు..!

మరిన్ని వార్తలు