నల్లగొండ : ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తేవాలి – PDSU

నల్లగొండ : ఫీజుల నియంత్రణకు సమగ్ర చట్టం తేవాలి – PDSU

నల్లగొండ , మన సాక్షి:

ధనార్చనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పిడిఎస్యు జిల్లా కార్యదర్శి పోలే పవన్ డిమాండ్ చేశారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పిడిఎస్యు కార్యాలయం శ్రామిక భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలను తలపించేలా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ప్రచారాలు చేపట్టారని ఆరోపించారు.

 

ప్రైవేటు కార్పొరేట్ స్కూలు కాలేజీ ఫీజులను నియంత్రించే సమగ్రమైన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు విద్యాసంస్థల్లో 25% ఉచిత విద్యను అందించడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోకపోతే పిడిఎస్యు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో డీఈఓ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

 

అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యాసంస్థలను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పిడిఎస్యు జిల్లా కమిటీ సభ్యులు ఇందూరు మధు పొనుగోటి రవికుమార్,శరత్ ,భాను, సుధాకర్ ,రాజు తదితరులు పాల్గొన్నారు.