TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

Rythu Bima : 18 ఏళ్లు నిండిన వారికి ఐదు లక్షల బీమా.. రెండు రోజులే గడువు.. కావలసిన పత్రాలు ఇవీ..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకు శుభవార్త తెలియజేసింది. 18 సంవత్సరాలు నిండిన రైతులు రైతు బీమా పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. గతంలో రైతు బీమా కు దరఖాస్తు చేసుకున్న వారు కాకుండా కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

అందుకు ఆగస్టు 13వ తేదీ చివరి తేదీగా నిర్ణయించింది. కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నందున 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న రైతులు రైతు బీమా దరఖాస్తులకు అర్హులు.

కావలసిన పత్రాలు :

రైతు బీమా దరఖాస్తుకు బీమా పొందే రైతు ఆధార్ కార్డు, వ్యవసాయ భూమి పట్టాదారు పాస్ పుస్తకం, నామిని ఆధార్ కార్డు, రైతు బీమా దరఖాస్తు ఫారం.

ఎక్కడ దరఖాస్తు చేయాలి..?

రైతు బీమా దరఖాస్తును వ్యవసాయ విస్తరణ అధికారికి అందజేయాలి. పూర్తిచేసిన దరఖాస్తు ఫారంకు ఆధార్ కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ ను జతచేసి వ్యవసాయ విస్తరణాధికారికి అందజేయాలి.

MOST READ : 

  1. Blood Group : మీకు ఆ బ్లడ్ గ్రూప్ ఉంటే స్ట్రోక్ ప్రమాదం ఎక్కువ.. అధ్యయనంలో నిర్ధారణ..!

  2. Rythu Bheema : రైతులకు గుడ్ న్యూస్.. రైతు బీమాకు దరఖాస్తుల స్వీకరణ..! 

  3. TGSRTC : తెలంగాణ ఆర్టీసీ భారీ గుడ్ న్యూస్.. వారందరికి టికెట్లపై రాయితీ..!

  4. TGSRTC : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై ఆర్టీసి కీలక ప్రకటన.. అలా చేస్తేనే ఫ్రీ టికెట్..!

మరిన్ని వార్తలు