క్రైంBreaking Newsతెలంగాణహైదరాబాద్

Hyderabad : మియాపూర్ లో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి…!

Hyderabad : మియాపూర్ లో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి…!

మన సాక్షి, హైదరాబాద్

ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గురువారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులు వెళ్లి పరిశీలించారు.

వివరాల ప్రకారం .. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మక్త మహబూబ్ పేట్ కాలనీలో నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మయ్య (60), ఉప్పరి వెంకటమ్మ (55), కూతురు కవిత (24) అల్లుడు అనిల్ (32 ) మనుమడు అప్పు (2) మృతి చెందారు. మియాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు.

ఆత్మహత్యా లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో మియాపూర్ పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన కుటుంబం కర్ణాటక నుంచి తెలంగాణకు వలస వచ్చినట్లు సమాచారం. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

MOST READ : 

  1. Mosquito : దోమల ద్వారా వచ్చే వ్యాధులేంటో.. ఎప్పుడొస్తాయో తెలుసా.. సర్వేలో ఆసక్తికర విషయాలు..!

  2. Aadhaar Cards : ఆధార్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్.. సవరణలకు కేంద్రాల ఏర్పాటు..!

  3. Gold Price : బంగారం ధరలకు ఇక బ్రేక్.. ఈరోజు తగ్గిందెంత.. తులం ధర ఎంతంటే..!

  4. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ఆ పంచాయతీ కార్యదర్శి సస్పెండ్..!

మరిన్ని వార్తలు