Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!

Unispace : హైదరాబాద్ లోనే గృహ రూపకల్పన, భవన పరిష్కారాల కోసం.. ఆసియాలోనే అతిపెద్ద కేంద్రం అపర్ణ యునిస్పేస్..!
హైదరాబాద్, మనసాక్షి :
భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలలో ఒకటైన అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్), గృహ రూపకల్పన, భవన నిర్మాణ పరిష్కారాల కోసం ఆసియాలోనే అతిపెద్ద అనుభవపూర్వక గమ్యస్థానంగా హైదరాబాద్‌లోని మియాపూర్‌లో యునిస్పేస్ మెగా స్టోర్‌ను ప్రారంభించింది. రెండు అంతస్తులలో 105,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక స్టోర్ ఒకే చోట అసమానమైన శ్రేణి విభాగ అవసరాలను తీర్చే ఉత్పత్తులను అందించడం ద్వారా రిటైల్ అనుభవాన్ని పునర్నిర్వచించనుంది.
ఈ మెగా స్టోర్ ప్రారంభం ఏఈఎల్ యొక్క రిటైల్ విస్తరణలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది, జూబ్లీ హిల్స్ (హైదరాబాద్), బెంగళూరు, విజయవాడలలో దాని పెరుగుతున్న యూనిస్పేస్ షోరూమ్‌ల నెట్‌వర్క్‌కు సరికొత్త స్టోర్ ను జోడిస్తుంది.
కొత్త యూనిస్పేస్ స్టోర్ 20 కి పైగా కేటగిరీల ఉత్పత్తులు, పరిష్కారాలను ఒకచోటకు తీసుకువచ్చింది. ఇది బి2బి , బి2సి కస్టమర్లకు అవసరమైన ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులో ఉంచే వేదికగా మారింది. ఇది భారతీయులు తమ ఇళ్లను రూపకల్పన చేసే, నిర్మించే మరియు పునరుద్ధరించే తీరులో గణనీయమైన మార్పును సూచిస్తుంది. రెండు అంతస్తులలో విస్తరించి ఉన్న ఈ స్టోర్‌లో టైల్స్ , ఫ్లోరింగ్, శానిటరీవేర్, బాత్ ఫిట్టింగ్‌లు, మాడ్యులర్ కిచెన్‌లు, వార్డ్‌రోబ్‌లు, యుపివిసి మరియు అల్యూమినియం విండోస్ + డోర్లు, ఎలక్ట్రికల్ మరియు లైటింగ్, ఉపకరణాలు, నిర్మాణ సామగ్రి, సాధనాలు మరియు యంత్రాలు, అవుట్ డోర్ ఫర్నిచర్, ల్యాండ్‌స్కేపింగ్ సొల్యూషన్‌లు మరియు మరిన్నింటితో సహా కేటగిరీ వారీగా డిస్ప్లే జోన్‌లు ఉన్నాయి.
ఈ స్టోర్ లో ప్రత్యేకంగా నిలిచే అంశం దాని లీనమయ్యే విధానం. నిపుణులైన ఇన్-హౌస్ డిజైన్ కన్సల్టెంట్ల బృందం మద్దతుతో వినియోగదారుల అనుసంధానతను మెరుగుపరచడానికి ఇంటరాక్టివ్ జోన్‌లు, సాంకేతిక ఆధారిత డిస్‌ప్లేలు మరియు ఉత్పత్తి డెమో ప్రాంతాలు సృష్టించబడ్డాయి. వినియోగదారులు పూర్తిగా సిద్దమైన అపార్ట్‌మెంట్ నమూనాల ద్వారా నడవవచ్చు, మాడ్యులర్ కిచెన్‌ల పనితీరు పర్యవేక్షించవచ్చు మరియు ఇంటరాక్టివ్ డిజిటల్ డిస్‌ప్లేల ద్వారా ఉత్పత్తులను అన్వేషించవచ్చు.
పరిశ్రమ కనెక్షన్‌లను మరింతగా పెంపొందించటానికి, వర్క్‌షాప్‌లు, ఆర్కిటెక్ట్ మీట్‌లు మరియు డిజైన్ సెమినార్‌లను నిర్వహించడానికి ప్రత్యేక ఈవెంట్‌ల ప్రాంగణం కూడా ఇక్కడ అందుబాటులోకి తీసుకురాబడింది. సౌలభ్యం కోసం, ఈ స్టోర్‌లో కేఫ్, పిల్లల జోన్ మరియు ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌లు కూడా ఉన్నాయి.
తమ మెగా స్టోర్ కోసం మియాపూర్‌ను ఎంచుకోవడమనేది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే ఏఈఎల్ యొక్క విధానాన్ని వెల్లడిస్తుంది. దాదాపు 150 కు పైగా రిటైల్ ప్రాజెక్టులు అభివృద్ధి దశలో ఉండటం తో పాటుగా అద్భుతమైన మెట్రో మరియు ఓఆర్ఆర్ కనెక్టివిటీ, హైదరాబాద్ యొక్క ఐటి మరియు పారిశ్రామిక క్లస్టర్‌లకు సమీపంలో ఉండటంతో, ఈ స్టోర్ వ్యూహాత్మకంగా ఆర్కిటెక్ట్‌లు, డిజైనర్లు, బిల్డర్లు మరియు రిటైల్ కస్టమర్లకు ఒకే విధంగా సేవలందించే స్థితిలో ఉంది.
భారతదేశంలో నిర్మాణ సామగ్రి మార్కెట్ 2024లో యుఎస్ 42.6 బిలియన్ డాలర్ల నుండి 2033 నాటికి యుఎస్ 64 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని మరియు ప్రపంచవ్యాప్తంగా 2025లో యుఎస్ 929.8 బిలియన్ డాలర్ల నుండి 2035 నాటికి యుఎస్ 1,696.8 బిలియన్ డాలర్లకు 6.2% సిఏజిఆర్తో పెరుగుతుందని అంచనా వేయబడింది, ఈ మెగా స్టోర్ హౌసింగ్, ప్రీమియం ఇంటీరియర్స్ మరియు స్థిరమైన నిర్మాణ రంగంలో తదుపరి దశ వృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేయడానికి చక్కటి స్థానంలో ఉంది.
అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అశ్విన్ రెడ్డి మాట్లాడుతూ, “ఏఈఎల్ ఇప్పుడు రూ. 2,000 కోట్ల సంస్థగా రూపాంతరం చెందడానికి ఆవిష్కరణలు, ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చే పద్ధతులు మరియు ఆర్ &డిలో భారీ పెట్టుబడి దోహదపడ్డాయి. మియాపూర్ లోని ఈ ప్రతిష్టాత్మక స్టోర్ ఆ ప్రయాణానికి ప్రతీక. అంతర్జాతీయ డిజైన్ భారతీయ చాతుర్యాన్ని కలిసే ప్రదేశమిది.
మా లక్ష్యం ఉత్పత్తులను అమ్మడమే కాదు, శాశ్వతంగా నిర్మించబడిన పరిష్కారాలను అందించడం, కస్టమర్‌లు నమ్మకంగా డిజైన్ చేయడానికి మరియు నిర్మించడానికి వీలు కల్పించడం. నాణ్యత, పర్యావరణ పరిరక్షణ మరియు ఆవిష్కరణలలో ప్రపంచవ్యాప్తంగా నాయకత్వం వహించాలనే భారతదేశం యొక్క ఆకాంక్షతో మా సమన్వయాన్ని ఇది ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి అపర్ణ రెడ్డి మాట్లాడుతూ, “మా 4వ యునిస్పేస్ స్టోర్‌ను ప్రారంభించడం మాకు సంతోషంగా ఉంది, ఇది భారతదేశంలోనే అతిపెద్దది కావటంతో పాటుగా ఆసియాలో గృహ రూపకల్పన , భవన నిర్మాణ పరిష్కారాల కోసం అతిపెద్ద అనుభవ పూర్వక కేంద్రాలలో ఒకటి. వినియోగదారుల ఎంపికలు మరియు కొనుగోలు అలవాట్లు మారుతున్నప్పుడు, మేము ప్రతిదీ ఒకే చోట అందించే ప్రాంగణం సృష్టించాలనుకున్నాము.
ఇది కస్టమర్‌లు ప్రేరణ పొందటానికి , నిపుణుల మార్గదర్శకత్వం , ప్రపంచ స్థాయి పరిష్కారాలను కనుగొనడానికి, తమ ఊహలకు జీవం పోయటానికి అనువైన ప్రదేశం. మా ప్రత్యేక భాగస్వామ్యాల ద్వారా ప్రీమియం ఇండియన్ ఉత్పత్తులు మొదలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఉత్పత్తుల వరకు మేము ఆకాంక్ష మరియు నమ్మకం రెండింటినీ ప్రతిబింబించే పోర్ట్‌ఫోలియోను రూపొందించాము. ఈ స్టోర్‌తో, ప్రజలు పొందే అనుభవాల తీరును , వారి ఇళ్లకు పరిష్కారాలను ఎంచుకునే విధానాన్ని పునర్నిర్వచించడమే మా లక్ష్యం” అని అన్నారు.
జాతీయ ఆత్మనిర్భర్ భారత్ మరియు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు అనుగుణంగా తీర్చిదిద్దబడిన ఈ కొత్త ప్రతిష్టాత్మక స్టోర్, ప్రపంచ స్థాయి సాంకేతికతలు మరియు స్థానిక నైపుణ్యం మద్దతుతో భారతీయ ఉత్పత్తుల బలంపై ఏఈఎల్ నమ్మకాన్ని నొక్కి చెబుతుంది.
బలమైన అంతర్గత ఆర్ &డి మద్దతుతో రూపొందించిన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియో భవిష్యత్తుకు సిద్ధంగా ఉండటంతో పాటుగా మన్నికైనది మరియు స్థిరమైనది, ఇది ప్రపంచ సరఫరా చైన్ లలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాబల్యంను ప్రతిబింబిస్తుంది. ప్రపంచ ప్రమాణాలను భారతీయ చాతుర్యంతో అనుసంధానించడం ద్వారా, కస్టమర్లకు సాధికారత కల్పించే అనుభవాలను అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ సృష్టిస్తోంది.
MOST READ :










