కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..!
తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు.

కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహులపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. మద్దతుగా పోలీసుస్టేషన్ కు మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ చేరుకున్నారు.
కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు నేనేం సమాధానం చెప్పాలి.. అంటూ దయాకర్ రావు. భావోద్వేగానికి గురయ్యారు. అధికారులు, పోలీసులు రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన దయాకర్ రావు.
ఎర్రబెల్లికి షాక్.. తొర్రూరు మున్సిపల్ పీఠం కాంగ్రెస్ కైవసం..!
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా రెండవ వార్డు సభ్యులు శ్రావణ్ కుమార్ విజయం సాధించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు సమాన ఓట్లు సభ్యుల మద్దతు ఉండడంతో ఎన్నికల అధికారి లక్కీ డ్రా ద్వారా చైర్మన్ ఎంపిక నిర్వహించారు. దాంతో లక్కీ డ్రా లో కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. కాంగ్రెస్ పార్టీకి ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫిషియో ఓట్లతో పాటు 9 ఓట్లు, బీఆర్ఎస్ కు తొమ్మిది ఓట్లు రావడంతో ఎన్నికల అధికారి ద్వారా ఎంపిక చేశారు.








