తెలంగాణBreaking Newsఅభివృద్దిజిల్లా వార్తలునల్గొండసంక్షేమం

Nalgonda : ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు.. వారికే అందిస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి..!

Nalgonda : ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలు.. వారికే అందిస్తాం.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడి..!

కనగల్, మన సాక్షి:

తమ ప్రభుత్వ హయాంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని రోడ్లు – భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం నల్లగొండ జిల్లా, కనగల్ మండలం, ధర్వేశిపురం(పర్వతగిరి) శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఆలయ ధర్మకర్తలచేత ఎండోమెంట్ అధికారులతో కలిసి ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకవర్గం చైర్మన్, డైరెక్టర్లు వారికి లభించిన పదవిని పదవిగా కాకుండా బాధ్యతగా పనిచేయాలని, దేవునికి సేవ చేస్తూనే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని, పాలకవర్గం దేవునికి భక్తులకు అనుసంధానంగా ఉండాలని, దేవాలయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు.

దేవాలయానికి నల్గొండ నుండే కాకుండా, హైదరాబాద్ నుండి కూడా భక్తులు వచ్చే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రేణుక ఎల్లమ్మ దేవాలయం అభివృద్ధిలో భాగంగా 15 రోజుల్లో చుట్టుపక్కల అంతర్గత రహదారులు మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని తెలిపారు.

దేవాలయ ఫంక్షన్ హాల్, కళ్యాణ మండపం ఎత్తు పెంచేలా కృషి చేస్తామని, దేవాలయ సౌకర్యాల కోసం 4 కోట్ల బడ్జెట్ అవుతుందని, ఇందుకు ప్రభుత్వంతో పాటు, పాలకవర్గ సభ్యులు సైతం ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.
కనగల్ మండల కేంద్రంలో అభివృద్ధి చేయనున్న జంక్షన్ ను పరిశీలించారు. నాలుగు రోడ్ల కూడలిలో రోడ్డు మధ్యలోంచి ఎటు 50 ఫీట్లు రోడ్డును విస్తరించాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.

రూ. 14 కోట్లతో చేపట్టనున్న కనగల్ నుంచి సాగర్ రోడ్డు వరకు వయా తిమ్మన్నగూడెం మీదుగా డబుల్ లేన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. కనగల్ మండలంలో రహదారుల అభివృద్ధికి గాను రోడ్లు, భవనాల శాఖ ద్వారా సుమారు 100 కోట్ల రూపాయలను ఇదివరకే మంజూరు చేసామని, దోరేపల్లి స్టేజి నుండి కురంపల్లి వరకు 50 కోట్లు, పగిడిమర్రి నుండి సోమన్నవాగు , అనంతారం మీదుగా సాగర్ రోడ్డు వరకు రూ. 40 కోట్లు మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.

ఈనెల 26 నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అందరికీ అందజేస్తామని మంత్రి తెలిపారు. నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా త్వరలోనే 900 కోట్ల రూపాయలతో ఏఎంఆర్పి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీ కాలువల లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

ఎస్ ఎల్ బి సి ద్వారా నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని, బస్వాపూర్ పథకాన్ని నెలలోనే పూర్తి చేస్తున్నామని చెప్పారు.మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నాలుగు భవనాల నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, అలాగే 80 కోట్లతో చేపట్టిన పనులు నడుస్తున్నాయని చెప్పారు.

గత ప్రభుత్వం 10 ఏళ్ల నుండి నుండి ఏ ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని ,ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వనున్నదని, ఈ నెల 27 నుండి రేషన్ కార్డులతో పాటు ,ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నామని, పాత రేషన్ కార్డులు అలాగే కొనసాగుతాయని, కొత్త కార్డులు 40 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ అశోక్ రెడ్డి , ఆర్ అండ్ బి అధికారులు, ఆలయ ఈవో జయరామయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏఎంసీ చైర్మన్ బిక్షం యాదవ్, వెంకట్ రెడ్డి, రాజు రెడ్డి, తహసిల్దార్ పద్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. జాబితా రెడీ.. లేటెస్ట్ అప్డేట్..!

  2. Banana : ఒక్క అరటిపండు రూ.100.. ఎక్కడో తెలిస్తే మీరు షాక్ కావాల్సిందే..!

  3. Viral Video : స్కూల్లో ఉన్నామనే మర్చారు.. ప్రధానోపాధ్యాయుడి గదిలోనే.. (వీడియో వైరల్)

  4. Jobs : నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. తెలంగాణలో కొలువుల జాతర..!

  5. Gold Price : బంగారం ధర ఎంతో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు