తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునల్గొండ
District collector : భవిత కేంద్రాలు వేగవంతంగా పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
District collector : భవిత కేంద్రాలు వేగవంతంగా పూర్తి చేయాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!
నల్లగొండ, మనసాక్షి :
భవిత కేంద్రం నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె నాంపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఉన్న భవిత కేంద్రంలో చేపట్టిన నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు భవిత కేంద్రాలలో కల్పించాల్సిన మౌలిక వసతులు తప్పనిసరిగా ఉండేలా చూడాలన్నారు.
.ముఖ్యంగా ర్యాంపు, టాయిలెట్స్, ఆక్టివిటీ రూము, ఇతర అన్ని సౌకర్యాలు భవిత కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎంఈఓ తో పాటు, ఇంజనీరింగ్ అధికారులు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి వహించి పూర్తిచేయాలని అన్నారు. గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ ,ఇన్చార్జ్ ఆర్డిఓ రమణారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ తహసిల్దార్ వెంకన్న, ఆర్ఐ విజయ, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.
MOST READ :
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే లావాదేవీల్లో కొత్త రూల్స్ వచ్చేశాయి.. పేమెంట్స్ ఫెయిల్ అయితే..!
-
TG News : రైతులకు శుభవార్త.. వారి ఖాతాలలో డబ్బులు జమ..!
-
Government : రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంపు..!
-
District SP : తెలంగాణలో సంచలనం.. పిల్లల అక్రమ రవాణా 13 మంది ముఠా అరెస్టు..!
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే యూజర్లకు బిగ్ అలర్ట్.. కొత్త రూల్ వచ్చేసింది.. తెలుసుకోండి..!









