Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!
Gas Cylinder : రూ.500లకే గ్యాస్ సిలిండర్.. ఎప్పటి నుంచి అంటే..!
తెలంగాణ బ్యూరో, మన సాక్షి :
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన ప్రారంభమైందని చెప్పవచ్చును. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే హామీల అమలుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజులలో హామీలను అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిన విషయం విదితమే. ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పెంపు చేపట్టారు. మిగతా గ్యారెంటీ హామీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ కూడా చేపట్టారు.
ALSO READ : Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!
మహాలక్ష్మి గ్యారంటీ స్కీములో భాగంగా ఉన్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందుకుగాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో చర్చలు చేపట్టారు. ఈ నెల 6వ తేదీన మరోసారి అధికారులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు ఎన్ని రీఫిలింగ్ చేస్తున్నారు. మొత్తం ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి.

వాటిలో 500 రూపాయలకు గ్యాస్ రీఫిలింగ్ ఇస్తే ప్రభుత్వం పై ఎంత భారం పడుతుంది. అందుకు బడ్జెట్ ఎంత కేటాయించాల్సి ఉంటుందనే అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం కానున్నారు. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ ఏ వర్గాల వారికి ఇవ్వాలని అంశం కూడా పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే 500 రూపాయలకు గ్యాస్ కనెక్షన్ ఎప్పటి నుంచి ఇస్తారని విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ALSO READ : మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!
ఉచిత విద్యుత్తు :
గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ వినియోగదారులు ఎంతమంది ఉన్నారు. వారికి ఉచితంగా విద్యుత్ అందిస్తే బడ్జెట్ ఏ మేరకు కేటాయించాల్సి ఉంటుందని అంశాన్ని కూడా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు.
ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!
ఇందిరమ్మ ఇల్లు :
గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ముఖ్యమంత్రిగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసి నిధులు అందజేశారు. కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి ఇంటి నిర్మాణం చేసుకునే పేదలకు 5 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. కాగా ఈ పథకంలో అర్హులుగా ఎవరెవరిని చేర్చాలని అంశాన్ని అధికారులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. త్వరలో ఈ పథకాన్ని కూడా ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని ప్రకటించనున్నారు.









