Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

Good News : నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త.. త్వరలో 15 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్…!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో శుభవార్త తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నారు. 6 గ్యారంటీ పథకాల అమలుకు చర్యలు వేగవంతంగా సాగుతున్నాయి.

ఇప్పటికే ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కల్పించడంతోపాటు ఆరోగ్యశ్రీ పెంచడం జరిగింది. అదేవిధంగా గ్యారంటీ పథకాలకు దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తి చేశారు. అంతేకాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూడా టీఎస్పీఎస్సీ చైర్మన్ నియమించారు.

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

కాగా బుధవారం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో 6956 మందికి వైద్య ఆరోగ్యశాఖలో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ తెలియజేశారు.

రాష్ట్రంలో త్వరలో 15వేల పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అందుకుగాను త్వరలో నోటిఫికేషన్ వెలబడుతుందని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా టిఎస్పిఎస్సి ద్వారా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదు కానీ కెసిఆర్ తన కూతురు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఇచ్చాడని అన్నారు.

ALSO READ : Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!

మరిన్ని వార్తలు