Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESviralజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంహైదరాబాద్

KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

మన సాక్షి : వెబ్ డెస్క్ :

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్ )ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆయన అర్జున్ రెడ్డి గెటప్ లో ఉన్న ఫోటో వైరల్ గా మారడం.. ఆ కథ ఏంటో తెలుసుకోవాలని ఉందా..?

క్లీన్ సేవ్ తో డీసెంట్ లుక్ లో కనిపించే మన కేటీఆర్ ఇలా ఉంటారా..? హెయిర్ స్టైల్ కూడా ఎప్పుడు సింపుల్ గా ఉంటుంది. మీసం, గడ్డం కూడా ఎప్పుడు పెంచుకోరు. మరి అలాంటి లీడర్ ఒక్కసారిగా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా.. మారిపోయాడేంటబ్బా.. అని అనుకుంటున్నారా..?

ALSO READ : Ys Sharmila : సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది.. ఏం పీక్కుంటారో పీక్కోండి, వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన.. !

క్లాస్ లుక్ నుంచి మాస్ లుక్ ఇచ్చిన కేటీఆర్ చిత్రాన్ని చూశారుగా.. అది నిజమైన ఫోటో కాదు. ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హీరోలు, నాయకుల ఫోటోలు ఎడిట్ చేసి కొత్త లుక్ లో పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే.

కేటీఆర్ వీరాభిమాని ఒకరు న్యూ లుక్ లో కేటీఆర్ ఫోటోను ఎడిట్ చేశారు. పొడవాటి గడ్డం, జుట్టు, మీసం ఎడిట్ చేసి కేటీఆర్ కు పంపించాడు.

ALSO READ : Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!

ఆ ఫోటో కేటీఆర్ కు బాగా నచ్చింది. దాంతో ఆయన ఆ ఫోటోను తన ట్విట్టర్ ఎక్స్ లో ట్రీట్ చేశారు. తన అభిమాని ఇలా ఎడిట్ చేసి పంపిన ఫోటోలు నేను ట్వీట్ చేస్తున్నాను అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు..

ఫోటోకు కేటీఆర్ కింద ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. జుట్టు గడ్డం పెంచుకుంటే.. అని బ్యాక్ లైన్ చేస్తూ నవ్వుతున్న ఎమోజిని యాడ్ చేశారు. కేటీఆర్ తన ఎక్స్ లో చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది.

మరిన్ని వార్తలు