Ys Sharmila : సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది.. ఏం పీక్కుంటారో పీక్కోండి, వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన.. !

ఆంధ్ర పిసిసి చీఫ్ వైయస్ షర్మిల దూకుడు పెంచారు. ప్రభుత్వం పై విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Ys Sharmila : సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది.. ఏం పీక్కుంటారో పీక్కోండి, వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ప్రకటన.. !

కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

మార్క్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ YSR – వైఎస్ షర్మిలా రెడ్డి

ఆయన పథకాలే ఒక మార్క్ – వైఎస్ షర్మిలా రెడ్డి

రోజుకో జోకర్ ను తెస్తున్నారు. నాపై నిందలు వేపిస్తున్నారు

సాక్షి సంస్థలో నాకు సగ భాగం ఉంది

ఎన్ని నిందలు వేసినా నేను వైఎస్ షర్మిలా రెడ్డి నే

నాన్న రక్తమే నాలో ఉంది.పులి కడుపున పులే పుడుతుంది

ఆంధ్ర రాష్ట్రం నా పుట్టినిల్లు. ఇక్కడ ప్రజలకు సేవ చేయడానికే వచ్చా

ఏం పీక్కుంటారో పీక్కోండి.ఎలా నిందలు వేస్తారో వేయండి

వైఎస్ షర్మిలా రెడ్డి

కడప జిల్లా, మన సాక్షి:

ఆంధ్ర పిసిసి చీఫ్ వైయస్ షర్మిల దూకుడు పెంచారు. ప్రభుత్వం పై విమర్శల బాణాలు ఎక్కు పెట్టారు. కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాటలు యధావిధిగా..

– ఎడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి…ఈ కడప బిడ్డ. పులివెందుల పులి

– తెల్లని పంచే కట్టు…మొహం నిండా చిరునవ్వు

– ఇవ్వాళ్టి వరకు తెలుగు ప్రజల గుండెల్లో ఆయనది చెరగని ముద్ర

– వైఎస్సార్ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించాడు

– వైఎస్సార్ పథకాలు పొందని గడపే లేదు

– పార్టీలకు అతీతంగా అందరూ పథకాలు పొందారు

– ఇది వైఎస్సార్ మార్క్… రాజకీయం

– రైతులకు రుణమాఫీ వైఎస్సార్ మార్క్..

– 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్..ఇది వైఎస్సార్ మార్క్.

– 46 లక్షల పేదలకు పక్కా ఇండ్లు కట్టడం వైఎస్సార్ మార్క్

– రైతును రాజు చేయడం వైఎస్సార్ మార్క్..

– 108 వైఎస్సార్ మార్క్..

– మాట తప్పడం ..మడమ తిప్పడం వైఎస్సార్ కి చేతకాదు..ఇది వైఎస్సార్ మార్క్.

ALSO READ : Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!

– తనకు మేలు చేస్తే..జీవితాంతం గుర్తు పెట్టుకోవడం వైఎస్సార్ మార్క్.

– నా అనుకున్న వాళ్లకు ప్రాణం సైతం ఇవ్వడం వైఎస్సార్ మార్క్

– నమ్మిన వాళ్ళను మనసులో ఎప్పటికీ ఉంచుకోవడం వైఎస్సార్ మార్క్

– ప్రజలకు అందుబాటులో ఉండటం . వైఎస్సార్ మార్క్.

– పథకాలు అందుతున్నాయో లేదో చూడటం వైఎస్సార్ మార్క్..

– ఇదే కడప జిల్లాకు వైఎస్సార్ ఎంతో చేశాడు

– వైఎస్సార్ బ్రతికి ఉంటే ..కడప జిల్లాకు కడప స్టీల్ వచ్చేది

– వైఎస్సార్ శంకుస్థాపన చేశారు

– కడప స్టీల్ వచ్చి ఉంటే … 20 వేల ఉద్యోగాలు వచ్చేవి…లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది

– కడప స్టీల్ ఒక కల గానే మిగిలిపోయింది

– కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్ట్ ను విభజన హామీల్లో పెట్టింది

– చంద్రబాబు 18 వేల కోట్లతో అని మళ్ళీ శంకుస్థాపన చేశారు

– బాబు 5 ఏళ్లలో కడప స్టీల్ పై నిర్లక్ష్యం వహించారు

– జగన్ ఆన్న గారు దీక్షలు కూడా చేశారు

ALSO READ : Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

– ముఖ్యమంత్రి అయ్యాక జగన్ ఆన్న రెండు సార్లు శంకుస్థాపన చేశారు

– కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారు

– వైఎస్సార్ హయాంలో కడప నుంచి బెంగళూర్ వరకు రైల్వే లైన్ అనుమతి తెచ్చారు

– కేంద్రంతో మాట్లాడి… ప్రాజెక్ట్ కు నిధులు కూడా తెచ్చారు

– 25 కిలేమేటర్ల వరకు నిర్మాణం జరిగింది

– వైఎస్సార్ మరణం తర్వాత… ఈ ప్రాజెక్ట్ పట్టింపు లేదు

– జగన్ ఆన్న గారి హయాంలో ఈ రైల్వే లైన్ అవసరం లేదని లేఖ రాశారు

– ఒక చిన్న లైన్ చాలని సర్దుకున్నారు

– మట్టి బిందెను తీసుకొని బంగారు బిందె ఇచ్చినట్లు ఉంది

– మోడీ తో దోస్తీ చేసే మీరు… ఎందుకు ఈ ప్రాజెక్టులను తేలేక పోయారు

– అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకు పోతే ఇంత వరకు మరమ్మత్తులు లేవు…

– రోడ్డున పడ్డ కుటుంబాలను పట్టించుకోలేదు

– వైఎస్సార్ తన జీవితంలో బీజేపీ నీ ఎప్పటికీ వ్యతిరేకించారు

– అలాంటి వ్యక్తి ఆశయాలను జగన్ ఆన్న నిలబెడుతున్నరా ?

– వైఎస్సార్ మైనారిటీలను ప్రేమించే వారు

– ఇప్పుడు జగన్ ఆన్న మైనారిటీల పై బీజేపీ దాడులు చేస్తుంటే …స్పందించడం లేదు

– వైఎస్సార్ ఆశయాలను కొనసాగించలేనీ మీరు వైఎస్సార్ వారసులు ఎలా అవుతారు

– బీజేపీ నీ అడిగే దమ్ములేదు…నిలదీసే దమ్ము కూడా లేదు

– పోలవరం అడిగే సత్తా లేదు…హోదా కోసం కొట్లాడే పరిస్థితి లేదు

దేశంలో బీజేపీ వేరే అర్థం ఉంటే… ఇక్కడ మాత్రం,బాబు,జగన్,పవన్..

ఈ ఎన్నికల్లో మన జాతకాలు మారాలి

– కడప నా పుట్టిన ఇల్లు…జగన్ ఆన్న లాగే నేను ఇక్కడే పుట్టా

– జమ్మల మడుగు ఆసుపత్రిలో నేను పుట్టా

– జగన్ ఆన్న కి నేను వ్యతిరేకి కాదు .జగన్ ఆన్నది రక్తమే

– కానీ జగన్ ఆన్న అప్పటి మనిషి కాదు

– ఇప్పటి జగన్ ఆన్న ను ఎప్పుడు చూడలేదు

– జగన్ ఆన్న క్యాడర్ కి,పార్టీకి నేను చేసిన సేవలు గుర్తుకు లేవు

ALSO READ : తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!

– నా మీద స్టోరీలు అల్లుతున్నారు

– రోజుకో జోకర్ ను తెస్తున్నారు . నా మీద బురద చల్లుతున్నారు

– నిన్న ఒక జోకర్ తో ప్రణబ్ ముఖర్జీ చెప్పాడట

– జగన్ జైల్లో ఉన్నప్పుడు..నా భర్త అనిల్ సోనియా ను కలిశారట

– జగన్ ను బయటకు రానివ్వద్దు అని లాబియింగ్ చేశామట

– ఇప్పుడు చెప్పడానికి ప్రణబ్ లేడు

– ఒక పెద్ద మనిషి పేరును కూడా మీరు వదలడం లేదు

– మీ కుట్రలకు అంతే లేదు

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!

– నాకు పదవి ఆకాంక్ష ఉంటే…నాన్న ను అడిగి తీసుకోనా ?

– వైసీపీ లో నైనా పదవి తీసుకోనా ?

– పదవి ఆకాంక్ష ఉంటే…మీకోసం నేను ఎందుకు మాట్లాడుత ?

– అనిల్ , భారతి రెడ్డి తో కలిసి సోనియా వద్దకు వెళ్ళారు

– భారతి కి తెలియకుండా సోనియా ను అడిగారా ?

– భారతి రెడ్డి లేనప్పుడు అడిగారా ?

– కనీసం ప్రణబ్ ముఖర్జీ కూడా ఎక్కడ చెప్పినట్లు రికార్డ్ కూడా లేదు

– తెలంగాణ లో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ ఫోన్లు చేస్తుంది

– నాపై వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు

– ఇదే సాక్షి సంస్థలో నాకు బాగం ఉంది

– సగం భాగం ఇచ్చారు వైఎస్సార్

– సగం భాగం ఉన్న నాపై నా సంస్థ బురద చల్లుతుంది

– నేను ప్రజల సమస్యల మీద మాట్లాడుతున్న

– హామీల వైఫల్యాల మీద మాట్లాడుతున్న

– విలువలు ,విశ్వసనీయత లేకుండా దిగజారుతున్నారు

– ఎవరెంత నిందలు వేసినా…నేను వైఎస్ షర్మిలా రెడ్డి

– ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడకు వచ్చా

– ప్రత్యేక హోదా వచ్చే వరకు. ఇక్కడ నుంచి కదల ..పోలవరం వచ్చే వరకు కదల…

– ఏం పీక్కుంటారో… పీక్కోండి

ALSO READ : BIG BREAKING : ఇప్పటినుంచి జగన్ ను అలాగే పిలుస్తా.. షర్మిల సంచలన ప్రకటన..!