తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నది. ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది.

తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా హామీలను అమలు చేస్తున్నది. ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించి గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. కాగా ప్రజాపాలనలో గ్యారెంటీ పథకాలతో పాటు రేషన్ కార్డుల కోసం భారీగా దరఖాస్తులు అందాయి. దాంతో రేషన్ కార్డుల లబ్ధి పొందాల్సన వారు అనేకమంది ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది.

రాష్ట్రంలోని నిరుపేదలైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా మీసేవ పోర్టల్ ద్వారా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకునేవారు ఫిబ్రవరి నెలకరిలోగా మీసేవ కేంద్రాలలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ప్రజా పాలనలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ఫిబ్రవరి నెలలోగా మీసేవ కేంద్రాలలో ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంది.

ALSO READ : Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!

రేషన్ కార్డుల కోసం ప్రజా పాలనలో వచ్చిన దరఖాస్తులను ప్రత్యేకంగా పరిశీలించ లేదు. అందుకుగాను మీ సేవ కేంద్రాలలో దరఖాస్తుల స్వీకరించాలని నిర్ణయించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల తో పాటు రేషన్ కార్డులలో ఉన్న పేర్లను తొలగించడం, కొత్తగా చేర్చడం, మార్పులు చేర్పులు చేసుకోవచ్చును. ఇవన్నీ కూడా మీసేవ ద్వారా చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొన్నది. రేషన్ కార్డుల దరఖాస్తు కోసం నేషనల్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను రూపొందించినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలోని పేద మధ్య తరగతి వర్గాలకు రేషన్ కార్డులు అత్యంత ఉపయోగమైతుంది. అందువల్ల ఈ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సంక్షేమ పథకాల అమలుకు అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి తప్పనిసరిగా రేషన్ కార్డు అవసరమైనందున సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు.

అదేవిధంగా బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రేషన్ కార్డులను కలిగి ఉన్నవారు కేవైసీ చేసుకోవాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ గత ఐదు మాసాలుగా కొనసాగుతుంది. అయితే ఈ కేవైసీ చేసుకోవడానికి జనవరి 31వ తేదీన తుది గడువుగా నిర్ణయించారు. ఆ లోపు రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కేవైసీ చేసుకోవాలని అధికారులకు సూచించారు.

ALSO READ : అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏం చేయాలో తెలుసా..!

ప్రతి రేషన్ డీలర్ వద్ద ఆధార్ నెంబర్ తెలియజేసి లబ్ధిదారులు వేలిముద్రను నమోదు చేస్తే ఈ కేవైసీ పూర్తి అవుతుంది. రేషన్ కార్డులు దారులు ఈకేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయి. రేషన్ కార్డు దారులు ఈకేవైసి ప్రక్రియను గడువులోగా పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.