Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!

Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

ఈ రోజుల్లో బ్యాంకు లోన్ తీసుకోవాలంటనే సవా లక్ష కారణాలు అడుగుతుంటారు. ఇంకా అనేక షూరిటీలు అడుగుతుంటారు. చాలామంది అలాంటివి చేయలేకనే లోన్లు తీసుకోవడం లేదు. కానీ గూగుల్ పే వాడే కస్టమర్లకు చాలా ఈజీగా రుణం అందించడానికి ముందుకు వచ్చింది. ఇప్పుడు గూగుల్ పే ఈజీగా 15 వేల రూపాయల నుంచి ఎనిమిది లక్షల రూపాయల వరకు లోన్ అందిస్తుంది.

సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే బ్యాంకులు పర్సనల్ లోన్లు తక్కువ వడ్డీకే ఆఫర్ చేస్తున్నాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కో విధంగా రేట్లు ఉంటాయి. అంతేకాకుండా పర్సనల్ లోన్ బ్యాంకులో తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. తీసుకునే అమౌంట్ ని బట్టి వడ్డీ రేట్లు కూడా మారుతుంటాయి. ఇలా చాలా టైం పట్టడంతో పాటు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం.. సర్వత్ర చర్చ..!

లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత అన్ని కరెక్ట్ గా ఉంటేనే లోన్ అందిస్తారు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు పేపర్ వర్క్ లేకుండానే వెబ్సైట్ యాప్ ద్వారా కూడా అందిస్తున్నారు. ఇలాంటి వాటికి పేపర్ వర్క్ అవసరం లేదు.

కానీ ఇప్పుడు గూగుల్ పే యాప్ వాడే వారికి శుభవార్త తెలియజేసింది. ఈ యాప్ నుంచి కూడా ఎలాంటి డాక్యుమెంట్లు అవసరం లేకుండానే పేపర్ వర్క్ లేకుండానే ఈజీగా పెద్ద మొత్తంలో లోన్ పొందే అవకాశం కల్పించింది. CBILL స్కోర్ మెరుగ్గా ఉండాలి. 15 వేల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. వడ్డీ రేట్లు మాత్రం 13.99 శాతంగా ఉంటాయి. తీసుకున్న లోన్ కు 6 నెలల నుంచి నాలుగేళ్ల వరకు తిరిగి చెల్లించే వాయిదాలు పెట్టుకోవచ్చును. ఇక నెలకు తక్కువలో తక్కువ 1000 రూపాయల నుంచి ఈ EMI చెల్లించుకోవచ్చును.

ALSO READ : అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏం చేయాలో తెలుసా..!

లోన్ కోసం ఇలా అప్లై చేయాలి :

గూగుల్ పే ప్రస్తుతం డిఎంఐ ఫైనాన్సు భాగస్వామితో లోన్ ఆఫర్ చేస్తుంది. మీ ఫోన్లో గూగుల్ పే యాప్ ఉంటే ఈ లోన్ పొందేందుకు వీలుంటుంది. గూగుల్ పే ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేయాలి. అక్కడ ఆఫర్ అండ్ రివార్డ్స్ కింద భాగంలో మేనేజ్ యువర్ మనీ అన్న సెగ్మెంట్లో లోన్స్ విభాగం ఉంటుంది. దానిని క్లిక్ చేయగానే అక్కడ లోన్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇన్స్టంట్ లోన్ అప్ టు 8 lakhs అని ఉంటుంది. ఇది 100% డిజిటల్ లోన్లు.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!

లోన్ మొత్తం బ్యాంక్ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. కింద అప్లై క్లిక్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ను ద్రవీకరించాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి తదుపరి స్టెప్ కు వెళ్లాలి. ఇక తర్వాత అడిగిన వివరాలు సమర్పించాలి. దీంట్లో అడ్రస్‌, బ్యాంక్ అకౌంట్, డీటెయిల్స్ అంటే ఉంటాయి. మీ అర్హతను బట్టి ఎంచుకున్న టెన్యూర్ను బట్టి లోన్ వస్తుంది. దీనిని ఈ EMI లో రీపేమెంట్ చేయవచ్చును.

మరిన్ని వార్తలు