మిర్యాలగూడ : మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం.. సర్వత్ర చర్చ..!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. అవిశ్వాస తీర్మానాలలో కాంగ్రెస్ పార్టీ నెగ్గడం బి ఆర్ ఎస్ చైర్మన్లు పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. దాంతో బీఆర్ఎస్ చైర్మన్ పదవిని కోల్పోయారు.

మిర్యాలగూడ : మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం.. సర్వత్ర చర్చ..!

మిర్యాలగూడ ,మన సాక్షి :

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు పెట్టారు. అవిశ్వాస తీర్మానాలలో కాంగ్రెస్ పార్టీ నెగ్గడం బి ఆర్ ఎస్ చైర్మన్లు పదవిని కోల్పోవడం జరుగుతుంది. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్రంలో కూడా చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గారు. దాంతో బీఆర్ఎస్ చైర్మన్ పదవిని కోల్పోయారు.

ఇది ఇలా ఉండగా మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఉంటుందా..? ఉండదా..? అనే విషయం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయం సాధించిన వెంటనే అవిశ్వాసం ఉంటుందని చర్చలు కొనసాగాయి. కొన్ని పత్రికలు కూడా ముందస్తుగానే అవిశ్వాసం ఉంటుందని కథనాలు కూడా రాశాయి. దాంతో పట్టణంలో మునిసిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం గురించి చర్చ కొనసాగుతుంది.

ALSO READ : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!
అవిశ్వాస తీర్మానం పెట్టే బలం కాంగ్రెస్ పార్టీకి ఉందా తీర్మానం ప్రవేశపెడితే నెగ్గకపోతే పరువు పోయే పరిస్థితి ఉంటుందా..? అని చర్చలు సాగుతున్నాయి. ఇటీవల నియోజకవర్గం లోని తడకమళ్ళ పిఎసిఎస్ చైర్మన్ పాదూరి సంజీవరెడ్డి వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. కానీ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దాంతో కాంగ్రెస్ పార్టీ కి చుక్కెదురైంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అవిశ్వాస తీర్మానాల వల్ల బలం చేకూరుతుండగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. దాంతో మిర్యాలగూడ మున్సిపాలిటీ చైర్మన్ భార్గవ్ పై అవిశ్వాస తీర్మానం ఉంటుందా..? ఉండదా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు :

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచే మిర్యాలగూడ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో రెండు గ్రూపులు కొనసాగుతున్నాయి. అయినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి విజయం సాధించారు. కానీ రెండు గ్రూపులు యధావిధి గానే కొనసాగుతున్నాయి. స్థానికంగా ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా రెండు గ్రూపులు కలవకపోవడం గమనార్హం. దాంతో మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ఒక గ్రూపుకు చెందిన కౌన్సిలర్లు సహకరించే అవకాశాలు లేవని తెలుస్తుంది. కాగా కొంతమంది కౌన్సిలర్లు, కౌన్సిలర్లుగా పోటీ చేసి ఓడిపోయిన వారు మాత్రం అవిశ్వాసం ఉంటుందా..? ఉండదా..? అనేది ఆయా వార్డులలో చర్చలు పెడుతున్నారు.

ALSO READ : యాదాద్రి పవర్ ప్లాంట్, అధికారులపై.. విజిలెన్స్ దాడులు..?

మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వారిలో ఐదు స్థానాలు ఖాళీ అయ్యాయి. కాగా అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి 3 వంతుల కౌన్సిలర్లు సహకరించాల్సి ఉంది. కాగా కాంగ్రెస్ పార్టీకి అంత బలం లేకపోవడంతో పాటు బీఆర్ఎస్ నుంచి కొత్తగా కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కూడా కనిపించడం లేదు. దానికి తోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు వివాదాల వల్ల కొంతమంది కౌన్సిలర్లు కూడా సహకరించక పోవచ్చునని భావిస్తున్నారు. దాంతో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ఉండకపోవచ్చని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.