యాదాద్రి పవర్ ప్లాంట్, అధికారులపై.. విజిలెన్స్ దాడులు..?

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో కూడా కొంతమందికి అన్యాయం జరిగిందని ఆరోపణలు గతంలోనే ఉన్నాయి.

యాదాద్రి పవర్ ప్లాంట్, అధికారులపై.. విజిలెన్స్ దాడులు..?

మిర్యాలగూడ, మన సాక్షి :

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రైతులకు చెల్లించే నష్టపరిహారం విషయంలో కూడా కొంతమందికి అన్యాయం జరిగిందని ఆరోపణలు గతంలోనే ఉన్నాయి. అంతే కాకుండా మరి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నేతలు నష్టపరిహారం రెండు, మూడు పర్యాయాలు కూడా తీసుకున్నట్లు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా అధికారికంగా ఎలాంటి విచారణ చేపట్టలేదు.

ALSO READ : Mahalakshmi : మహాలక్ష్మి పథకంలో రూ. 2500లకు అందరూ అర్హులు కాదా.. అర్హతలు ఇవేనా..!

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అక్రమాలపై విచారణ చేస్తామని ప్రకటించారు. కాగా ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తే ప్రభుత్వం విచారణకు ఆదేశించిందా..? అని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు వ్యయం 28 వేల కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. కాగా ఇది కేవలం ఇప్పటివరకు 50 శాతం కూడా పనులు పూర్తికాలేదు. దాంతో నిర్మాణ వ్యయం కూడా రెండింతలుగా పెరిగింది.

ALSO READ : Online app : ఆన్ లైన్ యాప్ లలో పెట్టుబడి పెట్టొచ్చా.. నల్గొండ జిల్లా యస్.పి చందనా దీప్తి ఏం చెప్పారో చూడండి..!

ఇదిలా ఉండగా యాదాద్రి పవర్ ప్లాంట్ కార్యాలయం, అధికారుల నివాసాలలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపడుతున్నట్లు సమాచారం. రైతులకు అందజేసిన నష్టపరిహారం వివరాలను సేకరించినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఉన్నత స్థాయి అధికారులు సైతం గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పవర్ ప్లాంట్ నిర్మాణంలో పూర్తిస్థాయి విచారణ చేపడితే అక్రమాలు బయటకు వస్తాయని పలువురు కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.