నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!

తెలంగాణలోని అన్ని డిపోలలో ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనల్ పేర్కొన్నారు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ, దరఖాస్తుల ఆహ్వానం..!

హైదరాబాద్, మన సాక్షి :

తెలంగాణలోని అన్ని డిపోలలో ఖాళీగా ఉన్న నాన్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనల్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

అప్రెంటిస్ లో శిక్షణ పొందేందుకు అర్హులైన నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (బీకాం, బీఎస్సీ, బిఎ, బి బి ఏ, బి సి ఎ) విద్యార్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు టీఎస్ ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtc.telangana.gov.in నిబంధనల మేరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు.

నిబంధనలు షరతులతో సంతృప్తి చెందడం ద్వారా ఆన్ లైన్ వెబ్ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ దరఖాస్తులు ఫిబ్రవరి 2వ తేదీలోగా చేసుకోవాలని పేర్కొన్నారు.