అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏం చేయాలో తెలుసా..!

అయోధ్యలో రామ మందిరం అత్యంత వైభవోపేతంగా సోమవారం ప్రారంభమైంది. బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తులు అయోధ్యకు భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యకు భక్తులు భారీగా హాజరై సందడి చేశారు.

అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఏం చేయాలో తెలుసా..!

మన సాక్షి , వెబ్ డెస్క్:

అయోధ్యలో రామ మందిరం అత్యంత వైభవోపేతంగా సోమవారం ప్రారంభమైంది. బాల రాముని విగ్రహ ప్రతిష్ట జరిగింది. దేశవ్యాప్తంగా రామ భక్తులు అయోధ్యకు భారీగా తరలివచ్చారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో దేవాలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్యకు భక్తులు భారీగా హాజరై సందడి చేశారు.

ఈ వేడుకకు ముందుగానే అయోధ్య నుంచి రామ మందిర అక్షింతలను ప్రతి ఇంటికి చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ప్రతి గ్రామంలో అయోధ్య నుంచి అక్షింతలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా అక్షింతలను తీసుకున్నారు. అప్పటికే అయోధ్య అక్షింతలను తీసుకొని పూజా గదులలో వాటిని ఉంచారు. అయితే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఏం చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారు. అయోధ్య రామాలయం లో బాల రాముని విగ్రహ ప్రతిష్ట అనంతరం ప్రతి ఒక్కరు కూడా అక్షింతలు వేసుకొని పూజలు నిర్వహించారు.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం.. సర్వత్ర చర్చ..!

అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను ఏం చేయాలనేది ప్రతి ఒక్కరికి ప్రశ్నగా మారింది. అయితే పండితులు ఆ అక్షింతలను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తే మంచిదో తెలిపారు. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను వివిధ సమయాలలో పుట్టినరోజులు వేడుకలు, పెళ్లిరోజుల వేడుకలు, ఉద్యోగాలలో ప్రమోషన్లు, కొత్తగా ఉద్యోగాలు రావడం, పిల్లలను ఆశీర్వదించే సమయంలో ఈ అక్షింతలను వాడాలని పండితులు పేర్కొన్నారు.

అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు ఆయా సమయాలలో వాటిని వాడితే మంచి జరుగుతుందని పేర్కొన్నారు. అలా కాకుండా అక్షింతలను ఎర్రటి పట్టు వస్త్రంలో కట్టి భద్రంగా దాచి పెట్టుకుంటే సీతారాముల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. అలా కాకుండా కొంతమంది పర్సులో కూడా పెట్టుకుంటే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని, ఈ అక్షింతలను నైవేద్యం వండినప్పుడు కూడా కొన్ని వేస్తే మంచిదని , ఇంకా కొంతమంది బొట్టు పెట్టుకునే సమయంలో ఉపయోగిస్తారని అలా ఉపయోగించినా మంచి జరుగుతుందని వేద పండితులు పేర్కొన్నారు.

ALSO READ: చైర్పర్సన్ పై అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు రాస్తారోకో