చైర్పర్సన్ పై అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు రాస్తారోకో

అనగారిన వర్గాలపై అగ్రవర్ణాల కుట్రలు సాగనివ్వమని సూర్యాపేట దళిత మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు, ప్రజలు తీవ్రంగా హెచ్చరించారు.

చైర్పర్సన్ పై అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు రాస్తారోకో

సూర్యాపేట , మనసాక్షి :

అనగారిన వర్గాలపై అగ్రవర్ణాల కుట్రలు సాగనివ్వమని సూర్యాపేట దళిత మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ పై పెట్టిన అవిశ్వాసాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని దళిత సంఘాల నాయకులు, ప్రజలు తీవ్రంగా హెచ్చరించారు. సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ పై పెట్టిన అవిశ్వాసాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తలమల్ల హాసేన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైతు బజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పాటు జిల్లా బిఆర్ఎస్ నాయకులు గుండగాని నాగభూషణం ఆధ్వర్యంలో తొమ్మిదో వార్డు ప్రజలంతా పెద్ద ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తలమల్ల హసేన్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు, టిఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు తప్పెట్ల శ్రీరాములు, బిఆర్ఎస్ జిల్లా నాయకులు గుండగాని నాగభూషణంలు మాట్లాడుతూ చైర్పర్సన్ అన్నపూర్ణపై అవిశ్వాసం అగ్రవర్ణాల కుట్రపూరిత చర్య అన్నారు.

బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఈ అవిశ్వాసాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధం కావాలన్నారు. ఐదేళ్లు నిండకుండానే దళిత మహిళ అని చూడకుండా అవిశ్వాసం ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. అగ్రవర్ణాల నాయకులు ఆలోచన చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస రద్దుకు సహకరించాలన్నారు.

వ్యవస్థలో కుల వివక్ష ఇంకా పోలేదని అందుకు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణపై పెట్టిన అవిశ్వాసమే నిదర్శనం అన్నారు. సూర్యాపేటను శుభ్రం చేసేందుకు దళితులు కావాలి కానీ పీఠంపై కూర్చునేదుకు దళితులు పనికిరారా అని ప్రశ్నించారు. 70 ఏళ్ల మున్సిపాలిటీ చరిత్రలో రిజర్వేషన్లు జరగలేదని జనరల్ స్థానంలో దళిత మహిళకు మున్సిపల్ చైర్పర్సన్ గా మాజీమంత్రి జగదీష్ రెడ్డి అవకాశం కల్పించారని అన్నారు.

ALSO READ : BREAKING : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల.. జగన్ పై సంచలన వ్యాఖ్యలు..!

నాటి నుంచి దళిత చైర్పర్సన్ను జీర్ణించుకోలేని అగ్రవర్ణాలు కుట్రపూరితంగా ఎలాగైనా దింపాలని పన్నాగాలు పన్ని నేడు దాన్ని నేడు సాధించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 15శాతం ఉన్న అగ్రవర్ణాలు 85% ఉన్న బడుగు బలహీన వర్గాలను శాసిస్తామంటే ఊరుకునేది లేదని ఐక్యంగా ఉండి దెబ్బకు దెబ్బ కొడతామన్నారు. వెంటనే దళిత మున్సిపల్ చైర్పర్సన్ పై పెట్టిన అవిశ్వాసాన్ని ఉపసర్మరించుకోవాలని లేని పక్షంలో రాబోయే ఎన్నికల్లో కుక్కకాటుకు చెప్పు దెబ్బలా తగిన బుద్ది చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.

రాస్తారోకో సందర్భంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగి వాహనాలు నిలిచి తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు కలగజేసుకొని రాస్తారో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బోలెద్దు దశరథ, బోడ శ్రీరాములు, పాలడుగు పరశురాములు, అశోధా రవి, దాసరి దేవయ్య, దైదా వెంకన్న, మద్దూరి కుమార్లతో దళిత సంఘాల నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ALSO READ : మిర్యాలగూడ : మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాసం.. సర్వత్ర చర్చ..!