BIG BREAKING : ఇప్పటినుంచి జగన్ ను అలాగే పిలుస్తా.. షర్మిల సంచలన ప్రకటన..!

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ ప్రమీల రెడ్డి మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. 

BIG BREAKING : ఇప్పటినుంచి జగన్ ను అలాగే పిలుస్తా.. షర్మిల సంచలన ప్రకటన..!

శ్రీకాకుళం , మన సాక్షి :

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు వైయస్ ప్రమీల రెడ్డి మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. వైవి సుబ్బారెడ్డి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బారెడ్డి గారికి నేను జగన్ రెడ్డి అంటే నచ్చలేదట.. ఇప్పటినుంచి జగన్ ఆన్న గారు అనే అంటా. నాకేం అభ్యంతరం లేదు.. నాకు అభివృద్ధి గురించి చూపిస్తా అని సవాల్ విసిరారు.

సరే సార్…మీరు చేసిన అభివృద్ధి చూపించండి. మీ అభివృద్ధి చూడటానికి నేను సిద్ధం. డేట్,టైం మీరు చెప్పండి. నన్ను చెప్పమన్నా నేను చెప్తా మేధావులను కూడా పిలుద్ధాం అన్నారు.

నాతో పాటు మీడియా వస్తుంది..ప్రతిపక్షాలు వస్తాయి.. మా అందరికీ చూపించండి.  మీరు అభివృద్ధి చేసింది ఎక్కడ ? మీరు చెప్పిన రాజధాని ఎక్కడా? పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడా ?మీ అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అంతా చూడాలని అనుకుంటుంది. మీ సవాల్ ను స్వీకరిస్తున్న అన్నారు.