తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!

గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ తమిళ్ సై రైతులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆమె కీలక ప్రకటన చేశారు. రెండు లక్షల రుణమాఫీ త్వరలో ఉందని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ : రైతుల రుణమాఫీ పై గవర్నర్ కీలక ప్రకటన..!

హైదరాబాద్, మన సాక్షి :
గణతంత్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ తమిళ్ సై రైతులకు గుడ్ న్యూస్ తెలియజేశారు. తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రుణమాఫీపై ఆమె కీలక ప్రకటన చేశారు. రెండు లక్షల రుణమాఫీ త్వరలో ఉందని ఆమె పేర్కొన్నారు.

శుక్రవారం హైదరాబాదులోని పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. రైతుల విషయంలో తమ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రుణమాఫీ కి సంబంధించి బ్యాంకులతో చర్చలు కూడా చేసినట్లు తెలిపారు.

ALSO READ: తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!

ఒక పద్ధతి ప్రకారం రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రైతు భరోసా పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయడానికి కసరత్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే చాలామంది రైతులకు రైతు భరోసా జమ అయ్యాయని, మరికొన్ని రోజుల్లో గీత రైతులందరికీ కూడా బ్యాంకులలో జమ అయితాయని తెలిపారు. వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేసేవిదంగా ప్రభుత్వం కార్యచరణ చేపట్టినట్లు తెలిపారు.

ALSO READ : Google pay Lone : గూగుల్ పే వాడుతున్నారా.. ఈజీగా రూ.8 లక్షల లోన్, అతి తక్కువ ఈఎంఐ..!