మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!

నల్లగొండ జిల్లా లోని మిర్యాలగూడ మరియు చుట్టుపక్కల మండలాల్లో రాత్రి వేళలో ట్రాన్స్ఫార్మర్ల లోని కాపర్ వైర్ మరియు అయిల్ ను దొంగతనాలు చేస్తున్న నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మిర్యాలగూడ డిఎస్పి వెంకటగిరి దొంగల ముఠాను పట్టుకున్నట్లుగా విలేకరులకు వివరించారు.

మిర్యాలగూడ : యూట్యూబ్ లో చూసి దొంగతనాలు.. ముఠాను పట్టుకున్న పోలీసులు..!

మిర్యాలగూడ : మన సాక్షి

నల్లగొండ జిల్లా లోని మిర్యాలగూడ మరియు చుట్టుపక్కల మండలాల్లో రాత్రి వేళలో ట్రాన్స్ఫార్మర్ల లోని కాపర్ వైర్ మరియు అయిల్ ను దొంగతనాలు చేస్తున్న నిందితులను మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మిర్యాలగూడ డిఎస్పి వెంకటగిరి దొంగల ముఠాను పట్టుకున్నట్లుగా విలేకరులకు వివరించారు.

నిందితులంతా నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ముప్పారం గ్రామానికి చెందినవారుగా పోలీసులు వివరించారు. నిందితుల్లో..
1. కుంచం కొటేష్
2. రూపాని గోపి
3. రూపాని @ కూపాని నాగయ్య
4. వరికుప్పల శ్రీను
5. ఒరుసు నాగరాజు
6. కుంచం విజయ్

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!

నిందితుల వద్ద నుండి స్వాధీనపరచుకున్న వివరాలు :

1. కాపర్ వైర్ 305 కిలోలు
2. HF Deluxe మోటార్ సైకిల్ నెంబర్ AP-24AV-0030
3. Hero Honda passion plus మోటార్ సైకిల్ నెంబర్. AP24-AG-2905
4. Glamour మోటార్ సైకిల్
5. 1 స్మార్ట్ ఫోన్ మరియు 2 కీ ప్యాడ్ ఫోనులు


నేరం చేసిన విదానం :

నిందితులు అందరూ నిడమానూర్ మండలంలోని ముప్పారం గ్రామానికి చెందిన వారు. వీరు సంపాదించే సంపాదన వారి చెడు వ్యసనాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బులు సంపాదించే మార్గం ఏదైనా ఉందా అని ఆలోచించగా, అప్పుడు వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్లలో లోని కాపర్ వైర్లు తీసి అమ్ముకుంటే సులభంగా డబ్బులు వస్తాయి కదా అని నిర్ణయించుకొని కాపర్ వైర్ ని ట్రాన్స్ఫార్మర్ నుండి తీయడం ఎలా అని యూట్యూబ్ లో పరిశోధించి తెలుసుకున్నారు.

ఆ తర్వాత వారందరూ కలిసి రాత్రి సమయాలలో బైక్ లపైన వివిధ ఊరులలో తిరుగుతూ ఏకాంత ప్రదేశంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ లను గుర్తించి పగలగొట్టి దొంగతనం చేసేవాళ్ళు. అలా మిర్యాలగూడ లో 2 దొంగతనాలు, వేములపల్లి లో 2 దొంగతనాలు, నెలకొండపల్లి లో 1 దొంగతనం, త్రిపురారం లో లో 2 దొంగతనాలు చేసినారు.

ALSO READ : Jobs : పదవ తరగతి అర్హతతో రైల్వే శాఖలో ఉద్యోగాలు.. జీతం రూ. 40 వేలు..!

అలా దొంగతనం చేసిన కాపర్ వైరును అప్పుడే అమ్మితే ఎవరికైనా అనుమానం వస్తుందేమో అనే భయంతో అమ్మకుండా అలాగే ఉంచి, వీరికి డబ్బులు అవసరం ఉండడంతో  కాపర్ వైర్ ను అమ్మాలని నిర్ణయించుకొని రెండు బైక్ ల పైన వారు దాచిపెట్టిన కాపర్ వైర్ నుండి కొంత వైర్ ను తీసుకొని మిర్యాలగూడ పట్టణంలోని స్క్రాప్ షాపులో అమ్ముదామని ముప్పారం గ్రామం నుండి మిర్యాలగూడ కి పైన తెలిపిన వ్యక్తులు రెండు బైక్ లపైన కొంత కాపర్ వైర్ ను రెండు బస్తాలో పెట్టుకొని వస్తుండగా మిర్యాలగూడ లోని హనుమాన్ పేట ఫ్లై ఓవర్ వద్దకు వచ్చేసరికి పోలీసు వారు వాహన తనిఖీలు చేస్తుండంతో వారు భయపడి పారిపోడానికి ప్రయత్నించగా వారిని మంగళవారం ఉదయం 11.45 కి పట్టుబడి చేసినట్లు తెలిపారు.

ALSO READ : Telangana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్..!

వారి నుండి దొంగ సొత్తు ను స్వాధీన పర్చుకొని నిందుతులను రిమాండ్ పంపనైనది. ఈ కేసును ఛేదించుటలో మిర్యాలగూడ డి.ఎస్.పి., పి. వెంకటగిరి ఆధ్వర్యంలో పనిచేసిన ఏ. నర్సింహా రావు సీ.ఐ మిర్యాలగూడ టు టౌన్, ఎస్సై లు యస్. క్రిష్ణయ్య, బి. రాంబాబు, డి. విజయ్ కుమార్, కే. వీర శేఖర్ , హెడ్ కానిస్టేబుల్ పి. వెంకటేశ్వర్లు, పి.సిలు, రవి, కె. నరేశ్ కుమార్, ఏండీ. అక్బర్, రామకృష్ణ, పోలీసు టిమ్ ను నల్గొండ జిల్లా ఎస్పీ జి. చందన దీప్తి అభినందించారు.