తాటి చెట్టు పై నుంచి కిందపడి గీతా కార్మికుడు మృతి..!

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొలుకులపల్లి గ్రామానికి చెందిన గీతా కార్మికుడు ఉడుతల వెంకటయ్య గౌడ్ (45) ఆదివారం సాయంత్రం తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

తాటి చెట్టు పై నుంచి కిందపడి గీతా కార్మికుడు మృతి..!

రంగారెడ్డి జిల్లా,మాడ్గుల, మన సాక్షి:

రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కొలుకులపల్లి గ్రామానికి చెందిన గీతా కార్మికుడు ఉడుతల వెంకటయ్య గౌడ్ (45) ఆదివారం సాయంత్రం తాటి చెట్టు పైనుంచి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. గీత వృత్తిలో భాగంగా ఆదివారం సాయంత్రం వెంకటయ్య గౌడ్ కొలుకులపల్లి శివారులోని వ్యవసాయ భూమిలో ఉన్న తాటిచెట్టు పైనుంచి కల్లు తీసే క్రమంలో ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి జారి కింద పడ్డాడు.

ఈ ప్రమాదంలో వెంకటయ్య గౌడ్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇది గమనించిన రైతులు, గీతా కార్మికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. మృతుడికి భార్య పార్వతమ్మ తో పాటు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. సంఘటన స్థలానికి వెంటనే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, స్థానిక ఎంపీటీసీ సభ్యులు బట్టు కిషన్ రెడ్డి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంకటయ్య గౌడ్ మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియ చేశారు.

ALSO READ : 

Mobile : మీ మొబైల్ ఫోన్ వర్షంలో తడిసి స్పీకర్లలోకి మీరు చేరిందా..? డౌట్ ఉంటే ఇలా చేయండి..!

NDA : చంద్రబాబు, నితీష్.. మోడీకి షాక్ ఇస్తారా..? 

Ration Card : మీకు రేషన్ కార్డు ఉందా..? ఉంటే ప్రతి నెల రూ. 5 వేలు పొందవచ్చు, మీరు తెలుసుకోండి..!

BREAKING : సీఎం రేవంత్ రెడ్డికి భారీ షాక్.. సొంత జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం..!