Gold Medal : యంవిఎన్ విజ్ఞాన కేంద్రం విద్యార్థినికి గోల్డ్ మెడల్.. ప్రముఖుల అభినందనలు..!
Gold Medal : యంవిఎన్ విజ్ఞాన కేంద్రం విద్యార్థినికి గోల్డ్ మెడల్.. ప్రముఖుల అభినందనలు..!
నల్గొండ ప్రతినిధి, మన సాక్షి :
నల్లగొండ జిల్లా కేంద్రంలోని యం.వి.ఎన్ విజ్ఞాన కేంద్రం, నేతృత్వంలో నిర్వహించబడుతున్న నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ విద్యార్థిని చందా ప్రణిత 2023-24 సంవత్సరానికిగాను సామాజిక శాస్త్రం (ఎకనామిక్స్) విభాగంలో గోల్డ్ మెడల్ అవార్డుకు ఎంపిక చేయబడింది. ఆగస్టు 19 న ఉస్మానియా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఈ అవార్డు అందుకోనున్నట్లు ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్, నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ అధ్యక్షులు డా. అక్కెనపల్లి మీనయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వరంగల్ పట్టణానికి చెందిన ప్రణిత నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ కోచింగ్ ద్వారా 2022లో రాష్ట్ర 10వ ర్యాంక్ సాధించి అర్ట్స్ కళాశాలలో 2022-2024 లో ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేసింది. దీంతో పాటు ఆమె అనేక విజయాలను స్వంతం చేసుకుంది. 2022 లోనే ఎకనామిక్స్ – గేట్ ఉత్తీర్ణతతో పాటు, డిసెంబర్ 2024లో యూజీసీ నెట్ లో జే ఆర్ ఎఫ్ లో ఉత్తీర్ణురాలైంది. తన విద్యను కొనసాగిస్తూనే, వివిధ జాతీయ, అంతర్జాతీయ జర్నల్స్ కు 27 వ్యాసాలు వ్రాసింది.
వీటితో పాటు, రెడ్ క్రాస్ సొసైటీ, వరంగల్ కమిషనరేట్ నిర్వహించిన మాదకద్రవ్యాల పునరావాసం కోసం పనిచేసినందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ నుండి ఉత్తమ వాలంటీర్, మోటివేషనల్ స్పీకర్ అవార్డును అందుకున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి, పార్లమెంట్ లో జాతీయ యువజన ప్రశంసా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కిరణ్ రిజుజు , జి. కిషన్ రెడ్డి ద్వారా అందుకున్నారు.
ప్రస్తుతం యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ , ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్‌కు సిద్ధమవుతున్న ఈమె మరిన్ని విజయాలు అందుకోవాలని ఫోరమ్ అసోసియేట్ అధ్యక్షులు త్రిపురం భాస్కర్ రెడ్డి, కార్యదర్శి షేక్ సుల్తానా, కోశాధికారి పాలడుగు నరేష్ ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి, కోశాధికారి జూలకంటి రంగారెడ్డి, ట్రస్ట్ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, తుమ్మల వీరారెడ్డి, విజ్ఞాన కేంద్రం కార్య నిర్వహణ కార్యదర్శి నర్సిరెడ్డి ప్రణితకు అభినందనలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి :
-
Nano Urea : నానో యూరియా వాడకం ఎలా.. రైతులకు వ్యవసాయ అధికారుల సలహాలు.!
-
TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!
-
TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!
-
SBI : ఎస్బిఐ అదిరిపోయే ఆఫర్.. వారికి పూచికత్తు లేకుండా రూ.4 లక్షల రుణం..!
-
UPI Payments : డిజిటల్ చెల్లింపులలో ఇది చాలా ఈజీ తెలుసా..!









