Suryapet : బంగారం చోరీ దొంగ అరెస్ట్..!
Suryapet : బంగారం చోరీ దొంగ అరెస్ట్..!
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి బంగారం షాప్ లో సం చలనం రేపిన బంగారం చోరీ కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నెల క్రితం జిల్లా కేంద్రంలోని సాయి సంతోషి బంగారం దుకాణంలో రెండున్నర కిలోల బంగారం చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరో నిందితుడు జాసిమొద్దీన్ (ఏ5)ను వెస్ట్ బెంగాల్ లోనీ మల్దా జిల్లాలో అదుపులోకి తీసుకున్నామని జిల్లా ఎస్పీ కే నరసింహ తెలిపారు.
నిందితుడి నుంచి రూ.25 లక్షల విలువ గల బంగారు ఆభరణాలు, రూ.4,84,500 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపా రు. నిందితుడిని రిమాండ్ కు తరలిస్తామని తెలిపారు. ఏడుగురు దొంగల ముఠాలో ఇప్పటి వరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.
ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పె క్టర్ వెంకటయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ శివకు మార్, సీసీఎస్ హరికృష్ణ, పెన్ పహాడ్ ఎస్ఐ గోపి, సూర్యాపేట టూ టౌన్ ఎస్ఐ శివతేజ, హెడ్ కానిస్టేబుల్ కర్ణాకర్, కృష్ణ, శ్రీనివాస్ పాలకీడు సైదులు మల్లేష్, సైదు లు, సతీష్, ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ కేసు లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఎస్పీ రివా ర్డులు అందజేశారు.
MOST READ :
-
TG News : తెలంగాణలో రెండో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన అల్ట్రావయొలెట్..!
-
Nalgonda : 24 గంటల్లో హత్య కేసు నిందితుడి అరెస్టు.. నల్లగొండ ఘటనలో సంచలన విషయాలు..!
-
Horticulture : రైతులకు భారీ శుభవార్త.. వారికి ఎకరానికి రూ.8వేలు సబ్సిడీ..!
-
CM Revanth Reddy : తెలంగాణలో అతి భారీ వర్షాలు.. జిల్లా కలెక్టర్లకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..!









