Good Friday : భక్తి శ్రద్దల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలు..!

గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దల మధ్య నిర్వహించుకున్నారు. శుక్రవారం ఉదయం 7:30 కి పట్టణంలోని నిర్మలా మాత దేవాలయం వద్దకు క్రైస్తవ సోదరులుఅధిక సంఖ్యలో హాజరయ్యారు.

Good Friday : భక్తి శ్రద్దల మధ్య గుడ్ ఫ్రైడే వేడుకలు..!

ప్రతి ఒక్కరు కరుణామయుని మార్గంలో నడవాలి

సూర్యాపేట, మనసాక్షి

గుడ్ ఫ్రైడే వేడుకలను శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్దల మధ్య నిర్వహించుకున్నారు. శుక్రవారం ఉదయం 7:30 కి పట్టణంలోని నిర్మలా మాత దేవాలయం వద్దకు క్రైస్తవ సోదరులుఅధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా యేసు ప్రభువును సిలువ వేసిన దినం, గుడ్ ఫ్రైడే యొక్క పవిత్రతను వివరిస్తూ సూర్యాపేట రోమన్ క్యాథలిసం విచారణ గురువు ఫాదర్ అసలు మరియన్న పరిశుద్ధ సిలువ మార్గాన్ని ప్రారంభించారు.

 

ప్రపంచ మానవాళి పాపముల మన్నింపు కొరకై ప్రభువైన యేసుక్రీస్తు సిలువ మరణం పొందారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఏసుప్రభు చూపించిన ప్రేమా,దయా, కరుణ, జాలి మార్గంలో నడవాలన్నారు. శ్రమ దినాలలో ప్రభువు అనుసరించిన మార్గంలో ప్రయాణిస్తే జీవితం సన్మార్గంలో నడుస్తున్న అన్నారు. అనంతరం పట్టణంలోని నిర్మల చర్చి నుండి అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్ సెంటర్, తెలంగాణ తల్లి బొమ్మ కొత్త బస్టాండ్ మీదుగా నిర్మల హాస్పిటల్ వరకు సిలువ మార్గం కార్యక్రమం కొనసాగింది.

 

అనంతరం మధ్యాహ్నం నిర్వహించిన పూజలు సిలువ ముద్దు కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలలో ఏసుక్రీస్తు శిలువ దారిగా బుర్రా శ్రీనివాస్, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కౌన్సిల్ సభ్యులు వల్ల బాలస్వామి, ముక్కల మర్రెడ్డి, నాగాటి ఏసుదాసు, బండ శ్యామ్, పిండిగ అజయ్, విజయ్ కుమార్ గంపల బాలయ్య, బటులుగా పట్టేటి బాలశౌరి, గోపి, కట్ట ఆనంద్, మిల్కీ రావు ఏ వి ఎం సిస్టర్స్ తేరిసా ఫాతిమా, నిర్మల సిస్టర్స్ రేజీ, జాన్ మేరీ, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : Nalgonda : ఇజ్రాయిల్ లాంటి ఎడారి దేశంలో 10, 15 రకాల పంటలు పండిస్తున్నారు..!