Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండవ్యవసాయం

Nalgonda : ఇజ్రాయిల్ లాంటి ఎడారి దేశంలో 10, 15 రకాల పంటలు పండిస్తున్నారు..!

Nalgonda : ఇజ్రాయిల్ లాంటి ఎడారి దేశంలో 10, 15 రకాల పంటలు పండిస్తున్నారు..!

నల్గొండ జిల్లాలో 370 ఐకెపి కేంద్రాలు ప్రారంభం – కలెక్టర్ హరి చందన దాసరి

నల్గొండ, మన సాక్షి :

యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకుగాను నల్గొండ జిల్లా వ్యాప్తంగా 370 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఈ యసంగిలో 5 లక్షల మె. టన్నుల ధాన్యం మార్కెట్ కు వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. గురువారం ఆమె నల్గొండ సమీపంలోని ఆర్జాలబావి వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గొల్లగూడెం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వరి కోతలు పూర్తయిన ప్రాంతాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందుగానే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు . వేసవిని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు ఇబ్బందులు కలగకుండా , అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పించామని, ముఖ్యంగా తాగునీరు, ఉండేందుకు నీడతో పాటు, ఆశ ,అంగన్వాడీ కార్యకర్తల ద్వారా ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లను సైతం సిద్ధంగా ఉంచడమే కాకుండా ఇతర సదుపాయాలన్నింటిని కల్పించినట్లు ఆమె వెల్లడించారు.

అంతకుముందు జిల్లా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ వేసవిలో తక్కువ నీటితో పండించే ప్రత్యామ్నాయ పంటల పై రైతులు దృష్టి సారించాలని, ఆరుతడి పంటలు వేసుకున్నట్లయితే ఎలాంటి నష్టం రాదని, అంతేకాకుండా దిగుబడి సైతం ఎక్కువగా వస్తుందని, మంచి లాభాలు పొందవచ్చని సూచించారు. లెమన్ గ్రాస్, వాణిజ్యపరమైన రెడ్ చిల్లి , ఎల్లో చిల్లి వంటి ప్రత్యేకమైన పంటలు పండించడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని, అలాగే ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పంటలు పండించాలని, ఇజ్రాయిల్ లాంటి ఎడారి దేశంలో 10, 15 రకాల పంటలు పండిస్తున్నారని, ఒకే పంట పై ఆధారపడకుండా వివిధ రకాల పంటలు పండించడం ద్వారా ఎక్కువ లాభం పొందవచ్చని అన్నారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ ,డి సి ఓ ఆర్. కిరణ్ కుమార్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ,పౌరసరఫరాల జిల్లా మేనేజర్ నాగేశ్వరరావు, డిఆర్డిఓ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి శ్రీకాంత్, తహసిల్దారు శ్రీనివాస్ తో పాటు, ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇంచార్జి అనంత రెడ్డి,రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు