travelBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

TGSRTC : సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

TGSRTC : సిటీ బస్సు ప్రయాణికులకు గుడ్ న్యూస్..!

మన సాక్షి, హైదరాబాద్ :

సిటీ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ న్యూస్ తెలియజేసింది. హైదరాబాద్ సిటీలో బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు ఆన్లైన్ పేమెంట్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇకపై ప్రయాణికులకు చిల్లర సమస్య ఉండకపోవచ్చు. ఆర్టీసీలో ప్రయాణికులకు కండక్టర్లకు మధ్య చిల్లర వివాదాలు స్వస్తి పలికేందుకు ఆర్టీసీ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది.

సిటీ బస్సులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చునని ప్రకటించింది. దాంతో యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకుని వసూలుబాటును కల్పించింది. ఇటీవల కొన్ని ప్రాంతాలలో ఈ విధానాన్ని తీసుకురాగా త్వరలో ఆన్‌లైన్ సేవలు మరిన్ని చోట్ల అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది.

ఇప్పటికే జిల్లాలకు వెళ్లే దూర ప్రయాణాలు చేసే లగ్జరీ, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ను తీసుకొచ్చింది. ఇక సిటీ బస్సుల్లో కూడా ఆన్‌లైన్ పేమెంట్ చేసే అవకాశం కల్పిస్తుంది.

MOST READ :

  1. Suryapet : సూర్యాపేట జిల్లాలో దారుణం.. ఎనిమిదేళ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నం..!

  2. Mega Job Mela : గందరగోళంగా మెగా జాబ్ మేళా.. వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు..!

  3. Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!

  4. UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!

మరిన్ని వార్తలు