TOP STORIESBreaking Newsవ్యవసాయం

Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!

Rythu : రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త.. రూ.2 లక్షల వరకు రుణాలు..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

రైతులకు ఆర్బిఐ అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. రైతులకు బ్యాంకులలో అందజేసే రుణాలపై వెసులుబాటు కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. దాంతో రైతులకు 2 లక్షల రూపాయల వరకు చిన్న, సన్నకారు రైతులకు పెద్ద ఉపశమనం కలగనున్నది.

ఈ విషయంపై ఆర్బిఐ కీలక నిర్ణయం తీసుకుంది. చిన్న, సన్న కారు రైతులకు ఎలాంటి షూరిటీ లేకుండానే రుణాలు ఇచ్చే పరిమితిని రెండు లక్షల రూపాయల వరకు పెంచింది. గతంలో 1. 66 లక్షల రూపాయలు ఉండగా ఇప్పుడు 2 లక్షల రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత తరుణంలో అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకొని చిన్న, సన్నకారు రైతులకు ఊరట కలిగించే విధంగా 2 లక్షల రూపాయల వరకు రుణం పెంచింది. 2019వ సంవత్సరంలో కూడా రుణ పరిమితిని పెంచింది. ఇప్పుడు మరోసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానివల్ల అనేక మంది రైతులకు ఉపశమనం కలగనున్నది.

MOST READ : 

మరిన్ని వార్తలు