Breaking NewsTOP STORIESతెలంగాణవ్యవసాయం

TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!

TG News : రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. ఇక నో టెన్షన్..!

మనసాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. దాంతో రైతులు ఇక యాసంగి సీజన్ లో టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా పోయింది. యాసంగి సీజన్ లోని ఎరువుల సరఫరా పైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు శుభవార్త తెలియజేశారు.

ఈ సీజన్లో రైతులు ఎవరు ఎరువుల కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో నాణ్యమైన ఎరువులు అందుబాటులో ఉంచుతామని అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వెల్లడించారు.

జనవరి, ఫిబ్రవరి మాసంలో యూరియా వినియోగం గరిష్ట స్థాయిలో ఉంటుందని, అందుకుగాను తగినంత యూరియా నిల్వచేసి పంపిణీకి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం తెలంగాణలో 2.48 లక్షల టన్నుల ఎరువులు నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇది యాసంగి ప్రారంభ దశలో రైతుల అవసరాలను తీరుస్తుందన్నారు.

ఇదిలా ఉండగా డిసెంబర్ మాసంలోనే రాష్ట్రానికి 86 వేల టన్నుల యూరియా కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ యూరియా వివిధ పోర్టులలో రవాణాకు సిద్ధంగా ఉంది. అందుకు రవాణా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు కూడా చేపట్టింది.

రవాణా ఆలస్యంగా రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యాసంగి సీజన్ లో వ్యవసాయ పనులు ఊపందుకోకముందే ఎరువులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆయన ఆదేశించారు.

MOST READ 

  1. Vemulapally : పంచాయతీ ఎన్నికల్లో రావులపెంటలో బిఆర్ఎస్ హవా..!

  2. TG News : మెస్సీ.. మేస్త్రీ ఫుట్ బాల్ అంటూ హరీష్ రావు సంచలన కామెంట్స్..!

  3. Banana : అరటిపండు ఆరోగ్యకరమే.. కానీ వారు తినకూడదు..!

  4. District collector : ఓటు వేసేందుకు వెళ్తున్నారా.. అయితే ఈ 18 రకాల గుర్తింపు కార్డులో ఏదైనా చూపవచ్చు..!

మరిన్ని వార్తలు