Rythu : రైతులకు శుభవార్త.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..!
Rythu : రైతులకు శుభవార్త.. ఆ పంటలకు మద్దతు ధర పెంపు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
రైతులకు నరేంద్ర మోడీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి రైతులకు సంబంధించిన అంశాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణకు 35 వేల కోట్ల రూపాయలు కేటాయించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది.
దాంతో పాటు యాసంగి సీజన్ కు సంబంధించి ఎరువుల సబ్సిడీపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. యూరియా కాకుండా మిగతా ఎరువులకు 2475 కోట్ల రూపాయల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించింది.
యాసంగి సీజన్ త్వరలో ప్రారంభమవుతున్నందున 2025 -26 యాసంగి సీజన్ లో ఆరు రకాల వంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పెరిగిన పంటల మద్దతు ధర వివరాల ప్రకారం..
♦️ పెసర క్వింటాకు 275 పెంచారు. దాంతో గతంలో క్వింటా పెసర 6,425 రూపాయలుగా ఉండగా ప్రస్తుతం పెరిగిన ధరతో 6,700 రూపాయలకు చేరింది.
♦️ శనగలు క్వింటా 5440గా ఉండగా 210 రూపాయల మద్దతు ధరను పెంచారు. దాంతో రూ. 5650 చేరింది.
♦️ గోధుమలకు 150 రూపాయల మద్దతు ధర పెంచారు. గతంలో 2275 రూపాయల గా ఉన్న గోధుమల మద్దతు ధర ప్రస్తుతం 2425 కు పెరిగింది.
♦️ పొద్దుతిరుగుడు క్వింటా 5800 రూపాయలు ఉండగా మద్దతు ధరను 140 రూపాయలు పెంచడంతో 5940కు చేరింది.
♦️ బార్లీ క్వింటా ధర 1850 ఉండగా 130 రూపాయలు పెంచడంతో 1980 రూపాయలకు చేరింది.
♦️ ఆవాలు క్వింటా 5650 ఉండగా 300 రూపాయల మద్దతు ధరను పెంచి 5950 రూపాయలకు పెరిగింది.
ఇవి కూడా చదవండి :
-
Runamafi : రుణమాఫీ కానీ రైతులకు శుభవార్త.. రేషన్ కార్డులు లేకున్నా మాఫీ.. ఎప్పటి వరకో చెప్పిన తుమ్మల..!
-
Viral Video : కొత్త జంట ఫస్ట్ నైట్.. చీ చీ ఇలాంటి సన్నివేశాలు.. సోషల్ మీడియాలో వైరల్.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)
-
Miryalaguda : సన్న దాన్యం, దొడ్డు దాన్యం కొనుగోలుకు వేరు వేరు కేంద్రాల ఏర్పాటు..!









