Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!
రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది.

Good News : రైతులకు భారీ గుడ్ న్యూస్.. వారి ఖాతాలలో డబ్బులు జమ అప్పుడే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ యోజన పథకం ద్వారా రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 21 విడతలుగా రైతులకు పంట పెట్టుబడి సహాయంగా అందజేస్తున్న విషయం తెలిసిందే.
ఈ పథకాన్ని 2015 వ సంవత్సరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఇప్పటివరకు 21 విడతలుగా ఏడాదికి ఆరువేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో నేరుగా డబ్బులు జమ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 22వ విడత డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 22వ విడత ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఒక్కొక్క రైతుకు రెండు వేల రూపాయల చొప్పున ఫిబ్రవరి మాసంలో రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.
అందుకోసం రైతులు ముందుగా బ్యాంకులలో తమ ఖాతాలకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉన్నదో..? లేదో..? సరిచూసుకోవాల్సి ఉంది. రైతులు తమ బ్యాంకు ఖాతా ఉన్న బ్యాంకులకు వెళ్లి ఆధార్ కార్డు తో సహా ఈ కేవైసీ ని పూర్తి చేసుకోవాలి. అలా పూర్తయిన రైతులకే 22వ విడత కిసాన్ డబ్బులు జమ కానున్నాయి.
MOST READ NEWS
-
TG News : రాజీ పడేది లేదు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం..!
-
Nalgonda : సొంత జిల్లాకే కలెక్టర్ గా వచ్చిన బడుగు చంద్రశేఖర్.. ఏ ఊరంటే..!
-
NEW YEAR : న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం.. బిర్యాని తిని ఒకరు మృతి, మరో 15 మంది అపస్మారక స్థితిలో..!
-
TG News : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు శుభవార్త..!









